నిలకడగా జయంతి ఆరోగ్యం.. కొద్దిరోజుల్లో డిశ్చార్జి.. రూమర్లపై ఖండన

ప్రముఖ నటి జయంతి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు దక్షిణాది సినీ ప్రముఖులనే కాకుండా అభిమానులను ఆందోళనకు గురిచేశాయి. శ్వాస సంబంధిత సమస్యలతో ఆమె బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరడం తెలిసిందే. ఆమెకు అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నారు.

తాజా వార్తల ప్రకారం ఆమె ఆరోగ్యం కుదుటపడిందని, నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారు, ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అన్నారు. నటి జయంతికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహించాం. అయితే ఆమెకు కరోనావైరస్ నెగిటివ్ అని తేలింది.

జయంతి ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను ఆయన కుమారుడు ఖండించారు. గత 35 ఏళ్ల నుంచి ఆమె అస్తమావ్యాధితో బాధపడుతున్నారు. ప్రతీ రోజు ఇన్‌హెలర్ వాడుతారు. ఈ మధ్య ఎక్కువ మోతాదులో శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చాయి. దాంతో హస్పిటల్‌లో చేర్పించాం అని కుమారుడు వెల్లడించారు.

Actress Jayanthi health stable and will discharge soon

దక్షిణాది చిత్ర పరిశ్రమలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే ట్యాగ్‌ను 80వ దశకంలో సంపాదించుకొన్నారు. అభినయ శారద అని బిరుదును సొంతం చేసుకొన్నారు. దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంజీ రామచంద్రన్, ఎన్టీఆర్, జెమినీ గణేషన్, నాగేశ్వరరావు లాంటి నటులతో పలు చిత్రాల్లో నటించారు.

జయంతి వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ ఉన్నతస్థాయిలో ఉండగానే దర్శకుడు పేకేటి శివరాంను వివాహం చేసుకొన్నారు. కొన్నేళ్ల దాంపత్య జీవితం తర్వాత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో వారిద్దరు విడిపోయారు.

ఇక జయంతి కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ఇప్పటి వరకు 500 చిత్రాల్లో నటించారు. దాదాపు 300 చిత్రాల్లో హీరోయిన్‌గా నటించడం విశేషం. తెలుగులో 1951లో భార్య భర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు. తన కెరీర్ మొత్తంలో నాలుగు సార్లు ఉత్తమ నటిగా కర్ణాటక స్టేట్ ఫిలిం అవార్డులు, రెండు ఫిలింఫేర్ అవార్డులు, ఒకటి రాష్ట్రపతి పతకం పొందారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X