Jaya Prada జయప్రదకు 6 నెలల జైలుశిక్ష.. కోర్టు తీర్పులో ట్విస్టు ఏమిటంటే?

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెన్నైలోని జయప్రద థియేటర్‌లో సిబ్బందికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ) చెల్లించకపోవడాన్ని తప్పు పడుతూ ఆమెకు 6 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జయప్రదపై కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపింది. అయితే ఈ కేసు తీర్పులో మద్రాస్ కోర్టు సడలింపు ఇవ్వడం కొంత ఊరట లభించింది. ఈ కేసులో కోర్టు తీసుకొన్న నిర్ణయం ఏమిటంటే?

జయపద్ర థియేటర్ సిబ్బందికి ఇన్సూరెన్స్ చెల్లింపు విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన విషయంపై జయప్రద తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి కోర్టు తీసుకొన్నది. 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలి. అలాగే 20 లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలి అని జస్టిస్ జీ జయచంద్రన్ ఆదేశాలు జారి చేసింది.

Actress Jayaprada get relief from Madras Court in ESI Case

జయప్రద థియేటర్‌ కేసులో జయప్రదతోపాటు ఆమె సోదరులు రామ్ కుమార్, రాజాబాబుకు విధించిన శిక్ష విషయంలో ఎలాంటి మినహాయింపుల ఇవ్వడం కుదరదు. ఈ కేసులో ఆ ఇద్దరికి 5000 రూపాయలు విధించాలని జరిమానా చెల్లించాలని ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పు లేదని కోర్టు వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఇద్దరు కోర్టుకు హాజరు కాకపోవడంతో వారికి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

జయప్రదకు విధించిన శిక్షను రద్దు చేయడానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. 20 లక్షల రూపాయలు కోర్టులో డిపాజిట్ చేస్తే శిక్షకు సంబంధించి తీర్పును కొట్టివేస్తామని కోర్టు తెలిపింది. తీర్పుకు సంబంధించిన నిబంధనలను సంతృప్తి పరిచితే తప్పా ఈ కేసులో బెయిల్ ఇవ్వమని దిగువ కోర్టుకు వెల్లడించింది.

నటి జయప్రదకు సంబంధించిన కేసు విషయానికి వస్తే.. చెన్నైలో ఉన్న థియేటర్‌లో జయప్రదతోపాటు రామ్ కుమార్, జయప్రద ముగ్గురు భాగస్వామ్యులు. వీరిపై ఇన్సూరెన్స్ చెల్లించలేదని 2005 సంవత్సరంలో కోర్టులో ఫిర్యాదు నమోదు చేసింది. తమ జీతం నుంచి ఈఎస్ఐ కోసం డబ్బు తీసుకోని.. ఆ ఖాతాలో జమ చేయలేదని తీర్పులో పేర్కొన్నది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించలేదని చెన్నై కార్పోరేషన్ థియేటర్‌ను సీజ్ చేసింది. అయితే తాము థియేటర్‌ను 2008 నడపడం లేదని కోర్టుకు వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X