జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా తీర్పు .. యాంకర్ ఝాన్సీ షాకింగ్ పోస్ట్
లేడీ కొరియోగ్రాఫర్‌పై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులు వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారం రేపింది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటికొచ్చి తన రోజువారీ జీవితంలో బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ ఇటీవల మీడియా ముందుకు రావడంతో సద్దుమణిగిందన్న వ్యవహారం మరోసారి ఆసక్తికర చర్చకు దారి తీసింది. తాజాగా జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
జానీ మాస్టర్ జైల్లో ఉన్న సమయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఆయనకు తొలుత ప్రకటించిన నేషనల్ అవార్డ్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఎన్నో కష్టాలు పడి జీవితంలో ఓ స్థాయికి చేరుకున్న దశలో జానీ మాస్టర్‌పై కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని తోటి కొరియోగ్రాఫర్లు ఆరోపణలు చేశారు. జానీని తాము ఏళ్లుగా చూస్తున్నామని.. ఆయన ఎలాంటి వారో అందరికీ తెలుసునని వారు చెబుతున్నారు.

ఇక రెండ్రోజుల క్రితం శ్రేష్టీ వర్మ మీడియా ముందుకొచ్చి.. జానీ మాస్టర్‌పై కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నాలుగేళ్ల పాటు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? త్వరలో ఏం చేయబోతున్నది అన్నదానిపై క్లియర్‌గా క్లారిటీ ఇచ్చింది. జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ రద్దు కావడం వెనుక తాను లేనని, ఆయనపై వచ్చిన ఆరోపణల వల్లే జాతీయ పురస్కారాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని శ్రేష్టీ వర్మ పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. బెయిల్‌పై బయటికొచ్చిన జానీ మాస్టర్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెబుతున్నాడు. ఇలాంటి పరిస్ధితుల్లో జానీ మాస్టర్‌కు కోర్టులో షాక్ తగిలింది. జానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్టీ వర్మ .. ఫిలిం ఛాంబర్‌లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై ఆ కమిటీ విచారణ చేపట్టింది.. అలాగే జానీని డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫిలిం ఛాంబర్ కోరింది. అయితే ఈ కేసులో తన నేరం రుజువు కాకుండా తనను ఎలా తప్పిస్తారని జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం .. జానీ పిటిషన్‌ను తాజాగా కొట్టివేసింది. ఈ వ్యవహారంపై సీనియర్ నటీ, యాంకర్, వాయిస్ ఆఫ్ ఉమెన్‌లో సభ్యురాలు ఝాన్సీ స్పందిస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఛాంబర్ ఆదేశాలను జానీ మాస్టర్ సవాల్ చేయగా.. దానిని కోర్టు కొట్టేసిందని, ఇది సంచలన తీర్పుగా ఝాన్సీ అభివర్ణించారు. వర్క్ ప్లేస్‌లో మహిళల భద్రతే ముఖ్యమని.. పీవోఎస్‌హెచ్ గైడ్‌లైన్స్‌ను అమలు చేసే సంస్థలకు మద్ధతు ఉంటుందని మరోసారి రుజువైందని ఝాన్సీ పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో బాధితురాలకి అండగా నిలిచి, పోరాడినందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మరి దీనిపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











