చీర విప్పి బెడ్‌పై పడుకో అంటూ .. స్టార్ డైరెక్టర్ బండారం బయటపెట్టిన హాట్ బ్యూటీ

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్ధితులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన నివేదిక బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఆ రిపోర్ట్ తర్వాత మహిళా నటులు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. వీరి మాటలతో పెద్ద మనుషుల్లా చెలామణి అవుతున్న వారి నిజస్వరూపాలు బయటికొస్తున్నాయి. హేమ కమిటీ నేపథ్యంలో కొందరు తారలు గతంలో మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగానే అన్ని ఇండస్ట్రీల్లోనూ కమిటీలు వేయాలని మహిళా నటులు కోరుతున్నారు. కొందరు నటులు కూడా ఈ విషయంలో వారికి సపోర్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పటికే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి కూడా చేశారు. దీనితో పాటు గతంలో 2019లో నియమించిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సామ్ డిమాండ్ చేశారు.

actress Jyothi hot comments on Tollywood star director here s the details

ఇదిలావుండగా.. హేమ కమిటీ నివేదిక తర్వాత కోలీవుడ్‌లో మహిళల రక్షణ పట్ల చర్యలు తీసుకుంటున్నారు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో మహిళలను వేధించే వారిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. సీనియర్ హీరోయిన్స్ రోహిణి, సుహాసినీ ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తారని విశాల్ చెప్పారు. హీరో, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ , టెక్నీషియన్ ఇలా ఎవరిపై ఆరోపణలు వచ్చినా సీరియస్‌గా తీసుకుంటామని హెచ్చరించారు.

ఇకపోతే.. తెలుగు వాంప్ క్యారెక్టర్లతో బాగా ఫేమస్ అయ్యారు జ్యోతి. రొమాంటిక్ కామెడీ క్యారెక్టర్లతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లాం ఊరెళితే, హంగామా చిత్రాలు జ్యోతికి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆ తర్వాత ఓ మై లవ్, ఎవడి గోల వాడిది, మహాత్మ, గుడుంబా శంకర్, కెవ్వు కేక, దరువు, యముడికి మొగుడు వంటి సినిమాల్లో ఆమె నటించారు. సినిమాల కంటే వివాదాలతోనే జ్యోతి ఎక్కువ పాపులర్ అయ్యారు. మధ్యలో ఓ సెక్స్ రాకెట్‌లోనూ ఆమె ఇరుక్కోగా.. ఆ తర్వాత జ్యోతికి అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగు బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చి తెలుగు లోగిళ్లకు మరింత దగ్గరైంది.

actress Jyothi hot comments on Tollywood star director here s the details

ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న జ్యోతి.. కెరీర్‌లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఓ స్టార్ డైరెక్టర్ షూటింగ్ సమయంలో చెప్పిన మాటలు తనను బాధపెట్టాయని చెప్పారు. ఆ డైరెక్టర్ కారణంగానే తనకు జనంలో గుర్తింపు వచ్చిందని, ఆయనకు ముందు సీన్ చెప్పే లక్షణం లేదని అదే ఓసారి తన కొంప ముంచిందని జ్యోతి పేర్కొన్నారు. ఓ సినిమా కోసం తనని ఆయన తనని పిలిచి చీర విప్పి పడుకోమని చెప్పడంతో తాను షాక్ అయ్యానని .. అప్పుడు సెట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్, లైట్‌బాయ్స్ ఇలా చాలామంది ఉన్నారని ఆమె తెలిపింది.

actress Jyothi hot comments on Tollywood star director here s the details

మనస్సాక్షికి విరుద్ధంగా తానెం చేయనని, ఈ క్యారెక్టర్ కంఫర్ట్‌‌గా లేదని ఈ సీన్ కొంచెం మార్చాలని ఆయనని రిక్వెస్ట్ చేశానని జ్యోతి చెప్పింది. దీంతో ఆ డైరెక్టర్‌కి కోపం వచ్చిందని, నాకే ఎదురు చెబుతావా అని ఫైర్ అయ్యాడని.. అయినా నేను చేయనని చెప్పి మేకప్ తీసి ఇంటికి వెళ్లిపోయినట్లు ఆమె వెల్లడించింది. అప్పటి నుంచి తాను ఆ డైరెక్టర్‌తో సినిమా తీయలేదని పేర్కొంది. ప్రస్తుతం జ్యోతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జ్యోతిని ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు ఎవరు అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X