ముంబై నటికి వాట్సప్‌లో నగ్నంగా కాల్ చేసిన వైసీపీ నేత.. హీరోయిన్‌పై పై వైసీపీ నేతలు, పోలీస్ ఆఫీసర్ల దాష్టికం!
ముంబైకి చెందిన యువ నటి కాదంబరి జెత్వానీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు పెట్టిన చిత్రహింసలు, వేధింపులు బయటకు వచ్చాయి. ప్రముఖ టెలివిజన్ చానెల్‌తో ఆమె లైవ్‌లో మాట్లాడుతూ.. విజయవాడ మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, పలువురు వైసీపీ నేతలు, పోలీస్ ఉన్నతాధికారులు తనను కిడ్నాప్ చేశారని కన్నీరుమున్నీరైంది. ఆమె లైవ్‌లో చెప్పిన విషయాల్లోకి వెళితే..
కుక్కల విద్యాసాగర్ తనకు రోజు అసభ్యపు మెసేజ్ పంపేవారు. వాట్సప్‌లో కాల్ చేసి నగ్నంగా నిలబడి సెల్ఫీ రూపంలో కనిపించేవాడు. నన్ను చాలా దారుణంగా వేధించారు. ఏపీ ప్రభుత్వంలోని శక్తిమంతమైన నేతలు, టాప్ పోలీస్ ఆఫీసర్లు గ్యాంగ్‌గా మారి తనకు చిత్రహింసలు పెట్టారు అని చెప్పారు.

తన జీవితంలో కాళరాత్రులుగా ఎన్నో రోజులు మారి నరకయాతన అనుభవించాను. ఆరు నెలలపాటు ఎవరితోను మాట్లాడలేదు. పక్కవారికి చెబితే చంపేస్తామని బెదిరించారు. ముంబైలో నన్ను కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. నా సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నా తల్లిదండ్రుల ఫోన్లు సీజ్ చేశారు. నా బంధువులను బెదిరించారు అని ఆమె అన్నారు.
వయసు మీరిన నా తల్లిదండ్రులకు చిత్రహింసలు పెట్టారు. నకిలీ డాక్యుమెట్ల సృష్టించి నన్ను దాదాపు 45 రోజులు బంధించి దారుణంగా టార్చర్ పెట్టారు. ఈ రోజుల్లో కూడా మహిళకు ఇలాంటి జరిగిందంటే ఇక స్త్రీలకు స్వేచ్ఛ ఎక్కడుంది అని అన్నారు.
ఒక అమ్మాయిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఇంకా అరెస్ట్ చేయలేదంటే ఏం జరుగుతున్నది. ఓ ఐపీఎస్ అధికారులు ఇలాంటి దరిత్రపనులు చేస్తారా? వారిని వెంటనే శిక్షించాలి అని రిటైర్డ్ ఎస్పీ మధుసూదన్ డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications











