Satyabhama: కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసీషన్.. తొలిసారి ఆ పని చేయడానికి రెడీ

టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే అందం, అభినయంతో మెప్పించి స్టార్‌గా ఎదిగిపోయిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. సుదీర్ఘ కాలం పాటు చిత్ర సీమలో ప్రభావాన్ని చూపించిన ఈ చిన్నది.. తల్లి కావడంతో కాస్త విరామం తీసుకుంది. కానీ, ఇప్పుడు మళ్లీ సినిమాల్లో సందడి చేస్తూ గతంలో మాదిరిగానే ఫుల్ బిజీగా గడుపుతోంది.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే 'భగవంత్ కేసరి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమెలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు కాజల్ అగర్వాల్ 'సత్యభామ' అనే సినిమాలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

Actress Kajal Aggarwal Own Dubbing For Satyabhama Movie

సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ నటిస్తోన్న 'సత్యభామ' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఈ మూవీ షెడ్యూళ్లను జరుపుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో అప్పుడప్పుడూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లను కూడా చిత్ర యూనిట్ ఇస్తోంది. దీంతో ఈ చిత్రం పేరు ట్రెండ్ అవుతోంది.

Actress Kajal Aggarwal Own Dubbing For Satyabhama Movie

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సత్యభామ' మూవీ నుంచి ఇటీవలే టీజర్ వచ్చింది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ కనిపించిన తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్ తీసుకున్న మరో నిర్ణయం గురించిన ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.

Actress Kajal Aggarwal Own Dubbing For Satyabhama Movie

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న 'సత్యభామ' మూవీ కోసం కాజల్ అగర్వాల్ సొంతంగా డబ్బింగ్ చెప్పబోతుందట. తద్వారా టాలీవుడ్‌లో తొలిసారి ఓ సినిమాకు పూర్తి స్థాయిలో ఆమె గొంతను అందించినట్లు అవబోతుంది. అలాగే, ఈ మూవీ కోసం కాజల్ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

సుమన్ చిక్కాల తెరకెక్కిస్తోన్న 'సత్యభామ' మూవీని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X