రిసార్ట్‌లో కల్పిక గణేష్ బూతు పురాణం.. పోలీసులు వెంటాడుతుండగా..
కుక్కతోక వంకరులా కొందరు సెలబ్రెటీల బుద్ధి ఏమాత్రం మారడం లేదు. సమాజానికి ఏది మంచో, ఏది చెడో చెప్పే స్థాయిలో ఉన్నప్పటికీ బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తిస్తుంటారు వీరు. ఈ కోవలోకే వస్తారు సినీ నటి కల్పిక గణేష్. కొద్దిరోజుల క్రితం ఓ పబ్‌లో బూతులు తిడుతూ.. ప్లేటులు విసిరి కొడుతూ ఆమె నానా హంగామా సృష్టించారు. దీంతో ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ కేసు విచారణ నడుస్తుండగా.. మరో వివాదంలో చిక్కుకున్నారు కల్పిక గణేష్.
ఫ్రెండ్ పాత్రలతో పాపులర్
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన కల్పిక గణేష్.. తొలుత ప్రయాణం అనే చిత్రంతో తన ఫిల్మ్ జర్నీ ప్రారంభించారు. ఆ తర్వాత ఆరెంజ్, నమో వెంకటేశ, మారో, జులాయి, సారోచ్చారు, నిప్పు తదితర చిత్రాల్లో నటించారు. అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత కజిన్‌గా నటించి బాగా పాపులర్ అయ్యారు కల్పిక గణేష్. హీరోయిన్లను మించిన అందగత్తె అయినప్పటికీ ఆమెకు ఎందుకో ఛాన్సులు రాలేదు. సెకండ్ లీడ్‌గా, హీరో హీరోయిన్లుగా ఫ్రెండ్ రోల్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2023లో చివరి సారిగా అథర్వ అనే సినిమాలో నటించిన కల్పిక గణేష్ మళ్లీ తెరపై కనిపించలేదు.

పబ్‌లో కల్పిక హల్‌చల్
గత నెలలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌లో ఉన్న ఫ్రిజమ్ పబ్‌లో తన బర్త్ డే జరుపుకునేందుకు కల్పిక వెళ్లారు. అర్ధరాత్రి వరకు అక్కడే స్నేహితులతో గడిపిన కల్పిక గణేష్.. పబ్ నిర్వాహకులతో గొడవ పడటం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఫుడ్ క్వాలిటీతో పాటు బిల్ చెల్లింపు కారణంగా వాగ్వాదం చోటు చేసుకుని గొడవకు దారి తీసింది. దాదాపు 2 గంటలకు పైగా గొడవ జరగ్గా.. గచ్చిబౌలీ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అయితే ఈ వివాదంపై పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లేట్స్ విసిరి కొట్టడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరో వివాదంలో కల్పిక
ఈ గొడవను మరిచిపోకముందే తాజాగా కల్పిక గణేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో ఉన్న ఓ రిసార్ట్‌కు క్యాబ్‌లో వెళ్లారు కల్పిక. రిసార్ట్‌కు వెళ్లగానే మెనూకార్డ్ విసిరేయడం, తన రూమ్ తాళాల్ని విసిరికొట్టడం, బూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించింది. ఈ దృశ్యాలు రిసార్ట్ లోపల ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పబ్లిసిటీ కోసమేనా?
తాజా వివాదంపై కల్పిక గణేష్ స్పందించింది. తాను సిగరెట్లు కావాలని అడిగితే రిసార్ట్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొంది. రిసార్ట్‌లో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేవని, క్యాబ్ బుక్ చేసుకునేందుకు వైఫై లేదని తెలిపింది. దీని గురించే తాను రిసార్ట్ మేనేజర్‌ని అడగ్గా అతను తనతో వాగ్వాదానికి దిగినట్లుగా చెప్పింది. మొన్న పబ్‌లో, ఇప్పుడు రిసార్ట్‌లో వరుస వివాదాలతో కల్పిక గణేష్ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా కల్పిక అవకాశం దక్కించుకున్నారని.. ఇందుకోసమే రెచ్చిపోతుందని కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











