ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే కళ్యాణీ, సూర్య కిరణ్ విడాకులు.. షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ సోదరుడు!
సత్యం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన డైరెక్టర్ సూర్య కిరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్యలతో ఇటీవలే ఆయన చికిత్స పొందుతూ మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన తర్వాత నుంచి కళ్యాణీతో ఈయన ఎందుకు విడాకులు తీసుకున్నారనే దానిపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తల్లో వాస్తవాల కంటే ఎక్కువగా కల్పితానే ఉన్నాయి. ముఖ్యంగా దీనిపై అటు కళ్యాణీ కానీ సూర్య కిరణ్ కానీ నోరు విప్పలేదు. కానీ తొలిసారి హీరోయిన్ కళ్యాణీ సోదురుడు చేతన్ చీను.. వారిద్దరి విడాకులపై నోరు విప్పారు. ఎందుకు డివోర్స్ తీసుకున్నారో చెప్పి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య కిరణ్. తెలుగుతో పాటు మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో నటించి మెప్పించాడు. కేరళకు చెందిన ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా.. మాస్టర్ సురేఖ్ పేరుతో అనేక చిత్రాలు చేశారు. ఆ తర్వాత నటుడిగానూ, దర్శకుడిగానూ మారి తన లాటెంట్ ప్రూవే చేసుకున్నాడు.
అయితే కెరియర్ పీక్స్ లో ఉండగానే.. హీరోయిన్ కళ్యాణీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిదీ ప్రేమ పెళ్లే అయినా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించారు. అయితే ఆ తర్వాత కొంత కాలానికే వీరు విడాకులు తీసుకున్నారు. అయితే ఎందుకు విడాకులు తీసుకున్నారనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా కళ్యాణీకి అతి దగ్గరి బంధువు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఓ వ్యక్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ముఖ్యంగా సొంత సోదరుడిలా కళ్యాణీకి అన్ని వేళలా తోడుకున్న చేతన్ చీను వీరిద్దరి విడాకుల గురించి తొలి సారి నోరు విప్పారు.

ముఖ్యంగా కళ్యాణీ, సూర్య కిరణ్ లు చాలా చక్కగా ఉండే వారని.. వారిద్దరి పెళ్లి అందరి మధ్య చాలా గ్రాండ్ గా జరిగిందని తెలిపారు. తన కుటుంబంతో కలిసి ఎప్పుడూ వారి ఇంటికి వెళ్లేవాడినని.. ముఖ్యంగా కళ్యాణీతో కలిసి పని కూడా చేశానని అన్నారు. అందురూ మెచ్చే భార్యాభర్తల ఉన్న సూర్య కిరణ్, కళ్యాణీలు విడిపోవడానికి కారణం ఓ సినిమా ఫ్లాప్ అవ్వడం అని తెలిపారు. ముఖ్యంగా సూర్య కిరణ్ డైరెక్షన్ లో ఓ సినిమా చాప్టర్ 6 అనే సినిమా వచ్చిందని తెలిపారు.
ఈ సినిమాకు కళ్యాణీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారని... చేతన్ చీను కూడా కళ్యాణీకి అసిస్టెంట్ గా పని చేసినట్లు తెలిపాడు. అయితే ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా ఫ్లాప్ అయి అనేక నష్టాలు వచ్చాయని.. ఆర్థికంగా పూర్తిగా కుదేలు అయిపోయారని తెలిపాడు. అప్పుడు ఈ టెన్షన్ వల్లే వారిద్దరి మధ్య గొడవలు అయ్యాయని.. దీంతో వారి విడిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











