అవకాశాలు కోసం పడుకోవాల్సిందే..నేను అదే చేశా ..నాగార్జున్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.
తాజాగా ఇండస్ట్రీలో ఉండే లైంగిక వేధింపుల గురించి నటి కస్తూరి శంకర్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కస్తూరి శంకర్ హీరోయిన్‌గా నటించిందనే విషయం తెలిసిందే. అన్నమయ్య సినిమాతో కస్తూరి శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కొంతకాలం నటనకు గ్యాప్ తీసుకున్న కస్తూరి శంకర్.. తిరిగి సీరియల్స్, వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ముఖ్యంగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కస్తూరి ..ఎప్పటికప్పుడు తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తుంటుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం కస్తూరి నైజం. మహేష్ సినిమాలో అమ్మ క్యారెక్టర్ వచ్చిన వదులుకున్నానని..ఆయన పక్కన హీరోయిన్‌గా నటిస్తాను కానీ..అమ్మగా అస్సలు నటించనని కుండబద్దలు కొట్టింది. తాజాగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఉన్న వాతావరణం గురించి తనదైనశైలిలో స్పందించింది. సినిమా ఇండస్ట్రీలో ప్రతిఒక్క నటి కూడా ఏదో ఒక స్టేజ్‌లో ఈ వేధింపులను ఫేస్ చేసే ఉంటుందని ఆమె తెలిపింది.

ఇది ఒక్క సినిమా రంగానికే పరిమితం కాదని..ప్రతి రంగంలోనూ ఇది కామన్ విషయమని ఈ సీనియర్ నటి చెప్పుకొచ్చింది. ఇల్లు కట్టే మేస్త్రి, మహిళా కూలీకి మధ్య కూడా ఇదే ఉంటుందని ఉదాహరణగా తెలిపింది. తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని..అయితే తెలుగులో నాకు ఎప్పుడు ఇలాంటి ఘటనలు ఎదురు కాలేదని కానీ..కోలీవుడ్, మాలీవుడ్‌లో ఎదుర్కొన్నట్లు చెప్పింది. తాను తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పుడు ఓ దర్శకుడు తనతో పడుకోమని కోరాడని తెలిపింది. కానీ నేను అతనికి నో చెప్పడంతో ఆ సినిమా నుంచి నన్ను తొలగించారని వివరించింది. కస్తూరి శంకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











