నాకు అఫైర్లు లేవు.. నేను తాగుబోతును కాదు: ప్రముఖ టెలివిజన్ నటి సంచలన వ్యాఖ్యలు
Kasthuri Controversy: ప్రముఖ టెలివిజన్ నటి కస్తూరీ శంకర్‌కు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఆమె నటి గానే కాకుండా.. అనలిస్ట్, లాయర్, సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు. సమాజం జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తారు. అలా నిత్యం వార్తల్లో నిలుస్తారు. తాజాగా ద్రవిడ, తమిళ వాదంలో భాగంగా తెలుగు వారిని తక్కువ చేసినట్టు కస్తూరీ మాట్లాడిందంటూ సోషల్ మీడియాలో వీడియో ప్రచారం అవుతుంది. ఆ వీడియోపై నటి కస్తూరీ క్లారిటీ ఇస్తూ .. కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
ప్రముఖ టెలివిజన్ నటి కస్తూరీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళనాడులో డీఎంకే వాళ్లు బ్రాహ్మణులపై వివక్ష చూపిస్తున్నారనీ, వారిని రకరకాలుగా అవమానిస్తున్నారన్నారు. డీఎంకే అజెండాలో మొదటిది నాస్తికత్వం. దేవుడు లేదని ప్రచారం చేయడం. రెండోవది బ్రాహ్మణ సమాజాన్ని అవమానించడం వాళ్ళను టార్గెట్ చేయడం. మూడవది సనాతన ధర్మాన్ని అవమానించడం, సనాతన ధర్మాన్ని నిర్మూలించడం . ఇక నాలుగది కేంద్రంలో బీజేపీని గద్దెదించడం అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది.

డీఎంకే గురించి, వారి అజెండా గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారిపై నిందలు వేయడం, అసత్య ఆరోపణలు చేయడం, వారికి అలవాటేననీ నటి కస్తూరి తెలిపింది. ఆ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎలాగేనా నాశనం చేయాలని వారి లక్ష్యం అంటూ డీఎంకే పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ క్రమంలోనే తనని తాగుబోతు అంటు ప్రచారం చేశారనీ, దాని నమ్మకపోయే సరికి.. ఓ డైరెక్టర్ తో అఫైర్ ఉండని ప్రచారం చేశారని, అసలు విషయం బయట పడ్డగా.. ఇప్పుడు ఇలా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నటి కస్తూరి.
కరుణానిధి కుటుంబం ఎప్పుడో తమిళనాడుకు వలస వచ్చిందనీ, కానీ వాళ్లు తమ గుర్తింపు దాటిపెట్టుకుని.. తాము కూడా తమిళ్ వాళ్లమేననీ ప్రచారం చేసుకుంటున్నారనీ, అసత్య ప్రచారాలు, అబద్దపు మాటలతో వారు అధికారంలోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను డీఎంకే పార్టీపై కామెంట్ చేస్తే...తన మాటలను వక్రీకరించారనీ, డిఎంకే చరిత్ర చెప్పడమే తన ఉద్దేశమని, కానీ తెలుగువారిని ఉద్దేశించి తాను తప్పుగా మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు నటీ కస్తూరి. గత కొన్ని సంవత్సరాలుగా తమిళనాడులో బ్రాహ్మణులు పాటు కాదని డీఎంకే ఓ ప్రాపగాండా సృష్టించారన్నారు. అసలు డీఎంకే వారే తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి. వాళ్లు తమిళులమని ప్రచారం చేసుకుంటూ పాలన చేయడం, వారి గుర్తింపును దాచిపెట్టుకోవడం కరెక్టేనా అంటూ కస్తూరి ప్రశ్నించారు.
వలస వచ్చిన వాళ్ళని అవమానించాల్సిన అవసరం తనకు లేదని, ఎంతోమంది ఎన్నో రాష్ట్రాలకు వెళ్లి వలస వెళ్లి అక్కడ బతుకుతూ వాళ్ళకొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జీవిస్తున్నారని నటి కస్తూరి తెలిపారు. 'కొందరూ 300 క్రితం రాజుల కాలంలో అంతఃపురాల్లో పని చేయడానికి వచ్చారు' అనే వ్యాఖ్యలు డిఎంకి లీడర్లు చేసినేననీ, వారి వ్యాఖ్యలనే తాను కోడ్ చేస్తూ ఆ ప్రసంగంలో మాట్లాడానని, పాత వీడియోలను చూస్తే ఆ విషయం తెలుస్తుందని చెప్పుకోచ్చారు. తనపై డిఎంకె కావాలని అసత్య ప్రచారం చేస్తుందని, తాను సనాతన ధర్మానికి ప్రచారం చేస్తున్నానని, ఇలాంటి కుట్రలు చేస్తున్నారని నటి కస్తూరి సంచలన విషయాలను బయటపెట్టారు.

తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి మరోసారి మాట్లాడుతూ.. డీఎంకే ఐటి వారి ప్రచారం, సోషల్ మీడియా ప్రచారంలో పడి తననీ తప్పుగా అర్థం చేసుకోకండనీ, తన బిడ్డలకు ప్రాణం పోస్తున్నది తెలుగు రక్తమేననీ, తన మెట్టినిల్లు తెలుగువాళ్లనేననీ, తాను తెలుగు వారికి గురించి ఏ రోజుకు తప్పుక మాట్లాడననీ తెలిపారు. తన మాట్లలను తప్పగా అర్థం చేసుకుంటున్నారనీ, తమిళ్ రానివారు. తెలియని వారు తన మాటలను ట్రాన్స్లేట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను మాట్లాడింది.. అంతా తమిళ గుర్తింపు, రాజకీయం, అస్తిత్వం గురించి మాత్రమేననీ, కానీ తనపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు కస్తూరీ. తెలుగు వారిని అవమానిస్తే.. తనని తాను అవమానించకున్నట్టు అని, తెలుగు వారు తనని ఒక గృహలక్ష్మి లాగా, తన ఇంట్లో మనిషిలాగా రిసీవ్ చేసుకున్నారని నటి కస్తూరి శంకర్ భావోద్వేగానికి లోనయారు.


Click it and Unblock the Notifications











