కత్రినా కైఫ్ కొత్త అవతారం... దీపిక, అనుష్క బాటలో
అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొంటున్న బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ మరో కొత్త అవతారం ఎత్తనున్నారు. త్వరలోనే కత్రినా నిర్మాతగా మారడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఇప్పటికే తన తోటి హీరోయిన్లు అనుష్క శర్మ, దీపిక పదుకోన్ నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే.
అనుష్కశర్మ 2015లోనే ఎన్‌హెచ్ 10 అనే చిత్రాన్ని, 2017లో పరి అండ్ ఫిల్లౌరీ అనే చిత్రాలను నిర్మించింది. దీపికా పదుకోన్ ప్రస్తుతం మేఘనా గుల్జార్ దర్శకత్వంలో స్వయంగా నటిస్తూ చపాక్ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వారి బాటలో కత్రినా వెళ్లేందుకు ప్లాన్ చేసుకొంటున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి భారత్ అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా కత్రినా మాట్లాడుతూ.. నాకు సొంత ప్రొడక్షన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. 2019 చివరికల్లా సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేస్తాను అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయి. వాటిలో దేనికి ప్రొడ్యూసర్‌గా నా పేరు పడుతుందో తెలియదు. కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది అని కత్రినా వెల్లడించారు. ఇటీవల షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన జీరో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అందులో ఆమె పాత్రకు మంచి మార్కులు కొట్టేశారు.
ప్రస్తుతం భారత్ చిత్రంలో కుముద్ రైనా అనే పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రలో కత్రినా పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమాలోని కత్రినా ప్రతిభకు జాతీయ అవార్డు రావడం గ్యారెంటి అని సల్మాన్ ఖాన్ అన్నారు. భారత్ చిత్రం జూన్ 5వ తేదీని విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











