నిర్మాతలే అసలు దొంగలు.. వారిని గోకుతారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్

ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి కొన్ని అంశాలను లేవనెత్తాడు. చిన్న సినిమా కష్టాలు, థియేటర్ల సమస్య, క్యారవాన్ల పద్దతిపై అందరికీ పరోక్షంగా కాస్త క్లాస్ పీకాడు. ఈ మధ్య క్యారవ్యాన్ల కల్చర్ ఎక్కువైందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పడు స్టార్ హీరోలు కూడా చెట్ల కొంద కూర్చోవడమో.. లేదా షూటింగ్ స్పాట్‌లోనే ఉంటూ మిగతా నటీనటులతో ముచ్చిటించటమో చేసేవారు. అయితే కాలం మారింది.. పరిస్థితులు పూర్తిగా మారాయి. ఇప్పుడు చిన్న ఆర్టిస్ట్‌కు సైతం స్పెషల్ క్యారవాన్ ఉంటోంది. ఇలా విచ్చలవిడిగా పెరుగుతున్న వాటిపై చిరు ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

ఆ పద్దతి మారాలి..

ఆ పద్దతి మారాలి..

నిర్మాత శ్రేయస్సు కోరే హీరోగా చిరుకు ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే. క్యారవాన్ల తగ్గిస్తే నిర్మాతకే కాదు అందరికీ మంచిదని సూచించాడు. వాటి వల్ల ఖర్చు తగ్గుతుంది.. హీరోలు, హీరోయిన్లు సెట్లోనే ఉండటం వల్ల క్వాలిటీగా వస్తుందని, త్వరగా షూటింగ్ ముగుస్తుందని, తక్కువ రోజుల్లోనే షూట్ కంప్లీట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. మా సమయంలో ఇలా ఉండేది కాదని అందరూ ఒకే దగ్గర కూర్చొని ఉండేవారమని, షూటింగ్ స్పాట్‌లోనే ఉండేవారమని చెప్పుకొచ్చాడు. క్యారవాన్లను తగ్గించాలని, ఆ పద్దతి మారాలని తెలిపాడు.

స్పందించిన సీనియర్ నటి కవిత..

స్పందించిన సీనియర్ నటి కవిత..

ఎన్నో సినిమాల్లో అమ్మగా, అక్కగా కనిపించి మెప్పించిన నటి కవిత. తాజాగా ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలను వెల్లడించింది. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి, నేటి హీరోయిన్లు ఎలా ప్రవర్తిస్తారు, నిర్మాతలు ఎలా ఉంటారు ఇలాంటి విషయాలెన్నో చెప్పుకొచ్చింది ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వాడుకోమన్న ప్రభుదేవా..

వాడుకోమన్న ప్రభుదేవా..

చిరంజీవి చెప్పినట్టుగా అప్పట్లో అందరం కలిసే ఉండేవారని, క్యారవాన్ అనేవి ఉండేవి కావని చెప్పుకొచ్చింది. క్యారవాన్ విషయంలో తనకు ఓ సంఘటన జరిగిందని నాటి సంగతులను బయట పెట్టింది. తాను వేరే షూటింగ్ నుంచి వచ్చానని, ఆ రోజు ఇంకో సినిమా కోసమని అప్పుడే సెట్‌కు వచ్చానని, అది పెళ్లి సీన్ అని చెప్పుకొచ్చింది. అయితే క్యాస్టూమ్స్ మార్చుకోవడానికి హీరోయిన్ క్యారవ్యాన్ వాడతానంటే ఒప్పుకోలేదని, వద్దని మొహం మీదే చెప్పేసిందని పేర్కొంది. ఆ సమయంలో తన క్యారవాన్ వాడుకోమని ప్రభుదేవా అన్నాడని చెప్పకొచ్చింది.

Recommended Video

Anil Ravipudi Impressed By O Pitta Katha Movie || Filmibeat Telugu
 వారే అసలు దొంగలు.. దువ్వుతారు

వారే అసలు దొంగలు.. దువ్వుతారు

అలా ఒక్కొక్కరికి ఒక్కో క్యారవాన్ పెడితే నిర్మాతలకు ఖర్చు పెరుగుతుందని, యాభై లక్షల్లో అనుకుంటే కోటి అవుతుందని కోటి అనుకుంటే రెండు కోట్లు అవుతుందని చెప్పుకొచ్చింది. అలా ఎవరైనా తమ క్యారవాన్ వేరే ఒకరు వాడుకోవద్దంటే నిర్మాతలు కలగజేసుకుని వారించాలి కానీ అలా చేయరు ఎందుకంటే వారు అసలు దొంగలు.. వారిని దువ్వుతుంటారు.. అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X