Kiara Advani weds Sidharth Malhotra.. కియారాను ప్రేమించి పెళ్లాడిన సిద్దార్థ్.. పెళ్లి తర్వాత రొమాంటిక్‌గా బుగ

హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరో, హీరోయిన్లు కియారా అద్వానీ, సిద్దార్థ్ డేటింగ్, లవ్ అఫైర్‌పై రకరకాల రూమర్లు, గాసిప్స్ భారీగా మీడియాలో వినిపించాయి. ఇక అలాంటి వార్తలు కనిపించకుండా.. ఇప్పటి వరకు ప్రేమ పక్షులుగా విహరించిన బాలీవుడ్ తారలు కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ఒక్కటై దంపతులుగా మారిపోయారు. రాజస్థాన్‌లోని జైసెల్మేర్‌లోని సుర్యాగఢ్ ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా జరిగిన పెళ్లి వేడుకలో కియారాను సిద్దార్థ్ జీవిత భాగస్వామిగా స్వీకరించారు. బాలీవుడ్ నుంచి తరలి వచ్చిన కరణ్ జోహర్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జుహీ చావ్లా తదితరులు ఈ పెళ్లికి సాక్షులుగా నిలిచారు.

Actress Kiara Advani weds Sidharth Malhotra

పెళ్లి తర్వాత కియారా అద్వానీ తమ సోషల్ మీడియాలో నాలుగు ఫోటోలను షేర్ చేశారు. కియారా చెక్కిలిపై ముద్దులు పెడుతూ.. అలాగే సిద్దార్థ్ బుగ్గపై ముద్దులు పెడుతూ ఫోటోలు తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో వదిలారు.

గత రెండు రోజుల క్రితంకియారా అద్వానీ, సిద్దార్థ్ పెళ్లి కోసం చారిత్రాత్మక సూర్యాగఢ్ ప్యాలెస్‌ను అందంగా ముస్తాబు చేశారు. వీరిద్దరి పెళ్లి ప్యాలెస్‌లోని బావ్డీ అనే ప్రదేశంలో నిర్వహిస్తారు. పెళ్లి అనంతరం వెంటనే రిసెప్షన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కియారా అద్వానీ పెళ్లిలో భాగంగా సూర్యాగఢ్ ప్యాలెస్‌లో సంగీత్ కార్యక్రమాన్ని జోష్‌గా నిర్వహించారు. కాబోయే వధూవరులు తమ సినిమాలకు సంబంధించిన, అలాగే బాలీవుడ్ హిట్ సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహర్, షాహీద్ కపూర్, కాలా చష్మా పాటకు డ్యాన్సులు వేశారు. ఇక షాహీద్ కపూర్ డోలా రే డోలా పాటకు జోష్‌తో స్టెప్పులు వేసి ఆకట్టుకొన్నారు. హల్దీ, మెహందీ ఫంక్షన్లు ఉత్సాహంగా జరుపుకొన్నారు.

వివాహం అనంతరం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటిస్తూ.. పర్మినెంట్ బుకింగ్ మాకు అయిపోయింది. ఇక ముందు సాగే మా జీవితానికి మీ దీవెనులు, ఆశీస్సులు కావాలి అంటూ కియారా పెళ్లి ఫోటోలను పేర్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X