కారావ్యాన్స్ లేక అక్కడే బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది: లావణ్య త్రిపాఠీ
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ గర్ల్ లావణ్య త్రిపాఠి. కెరీర్ మొదట్లోనే ఈ అందాల రాక్షసి తన సొట్ట బుగ్గల అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇకపోతే ఇటీవల లావణ్య కెరీర్ మొదట్లో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి వివరించింది.

చిట్ చాట్..
లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా చురుగ్గానే కనిపిస్తుంది. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా కూడా అమ్మడు అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. గాసిప్స్ ఎన్ని వచ్చినా కూడా లెక్క చేయదు. కానీ తనపై ఎవరైనా వాస్తవాలు లేకుండా కామెంట్స్ చేస్తే కూడా ఈ క్యూట్ గర్ల్ అస్సలు సహించదు.

లాక్ డౌన్ ఎఫెక్ట్..
లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూన్నాను అంటూ.. లాక్ డౌన్ కారణంగా ఓ విదంగా తనకు మంచే జరిగిందని ఈ బ్యూటీ చెబుతోంది. చాలా కాలం తరువాత తన కుటుంబ సబ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే ఛాన్స్ దొరికిందని ఆంటోంది. లావణ్య తన ఫ్యామిలీతో అప్పుడప్పుడు లాంగ్ ట్రిప్స్ కి వెళుతుంది. కానీ కరోనా వల్ల ఈసారి ఎక్కడికి వెళ్లడం కుదరలేదట.

కారావ్యాన్స్ కూడా లేవు..
తన ట్విట్టర్ ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. కెరీర్ మొదట్లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి కూడా ఈ బ్యూటీ వివరణ ఇచ్చింది. కెరీర్ మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఒక సినిమా బడ్జెట్ చాలా తక్కువ కావడంతో కనీసం కారావ్యాన్స్ కూడా లేవు. దీంతో ప్రొడక్షన్ వ్యాన్ లోనే బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది అని లావణ్య వివరణ ఇచ్చింది.
Recommended Video

నా పాత్రలకు న్యాయం చేయడమే..
నాకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఒక నటిగా పాత్రకు సరైన న్యాయం చేస్తున్నానా లేదా అనే విషయం గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తాను. నా మొదటి సినిమాలో ఎదురైన అనుభవాలు కూడా నాకు ఇంకా గుర్తున్నాయి. గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా నేను సిద్ధమే కాకపోతే ఏం చేసిన కథలో పాత్రను బట్టి ఉండాలని లావణ్య తెలియజేసింది.


Click it and Unblock the Notifications











