twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీరకట్టుతో అదరగొట్టిన లావణ్య త్రిపాఠి.. కాటన్ దుస్తుల్లో కవ్విస్తూ ఫోటోషూట్

    |

    అందం, అభినయం కలిసి ఉన్న యువ హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంటే అందుకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. విభిన్న చిత్రాలతోపాటు విలక్షణ పాత్రలతో లావణ్య ఆకట్టుకొంటున్నారు. ఇక లాక్‌డౌన్‌లో సౌందర్య పోషణతోపాటు సామాజిక కార్యక్రమంలో తన బాధ్యతను గుర్తు చేసుకొన్నారు. కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తుంటే హైదరాబాద్‌లో ఆ ప్రాణాంతక వ్యాధి నివారణకు చర్యలు తీసుకొంటున్నారు. ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో లావణ్య త్రిపాఠి తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. అందంతో ఆకట్టుకొంటున్న లావణ్య త్రిపాఠి 100 రోజులకుపైగా లాక్‌డౌన్‌లో ఏం చేశారంటే..

    చేనేత దుస్తులతో ఫోటోషూట్

    చేనేత దుస్తులతో ఫోటోషూట్

    లాక్‌డౌన్‌లో చేనేత వస్త్రాలను ధరించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. తాజా ఫోటోషూట్‌లో సంప్రదాయ సుందరిగా మారిపోయింది. నిండుగా చీరకట్టుతో భారతీయ స్త్రీ అనే ఫీలింగ్ కల్పించింది. తాజాగా కాటన్ సారీలో లావణ్య త్రిపాఠి షోటోషూట్ క్రేజీగా మారింది. సోషల్ మీడియాలో లావణ్య ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

    సినిమా కోసమా? బ్రాండ్ ప్రమోషనా?

    సినిమా కోసమా? బ్రాండ్ ప్రమోషనా?

    అయితే లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన లావణ్య త్రిపాఠి తాజా ఫోటోషూట్ చేయడంపై అభిమానులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏదైనా సినిమాలోని పాత్ర కోసం ఫోటోషూట్ చేశారా? లేక చేనేత దుస్తులను ప్రమోట్ చేయడానికి ఈ ఫోటోలు దిగారా అనే కోణంలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా సందీప్ కిషన్‌తో కలిసి ఏ1 ఎక్స్‌ప్రెస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూట్ పూర్తి కావాల్సి ఉంది.

    రెడ్ ట్రీ మాస్కులతో లావణ్య త్రిపాఠి

    రెడ్ ట్రీ మాస్కులతో లావణ్య త్రిపాఠి

    ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ సమయంలో 'రెడ్‌ట్రీ' బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి మాస్క్‌లను తీసుకొచ్చారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన డిజైనర్ అనితారెడ్డి సహకారం తీసుకొన్నారు. గో లోకల్.. బీ వోకల్ అనే కాన్సెప్టుకు తగినట్టుగా స్థానిక ప్రతిభకు వెలికి తీసే బాధ్యతను లావణ్య త్రిపాఠి భుజానికి ఎత్తుకొన్నారు. లావణ్య మార్కెట్‌లోకి తెచ్చిన మాస్కులకు మంచి డిమాండ్ కనిపించింది.

     లాక్‌డౌన్‌లో చేతివృత్తుల వారికి ప్రోత్సాహం

    లాక్‌డౌన్‌లో చేతివృత్తుల వారికి ప్రోత్సాహం

    రెడ్ ట్రీ మాస్క్‌ల తయారీ వెనుక విషయాలను వెల్లడిస్తూ.. లాక్‌డౌన్ సమయంలో మాకు చాలా మంది టైలర్స్, మాస్టర్స్‌కు సెలవులు ఇచ్చారు. అయితే ఆ సమయంలో వారి సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించి మాస్కుల తయారీపై దృష్టిపెట్టాం. కరోనా సమయంలో నాణ్యమైన మాస్కులు అందజేయడం, టైలర్స్ పని కల్పించే బాధ్యతను చేపట్టి మంచి ఫలితాలను సాధించాం అని లావణ్య త్రిపాఠి చెప్పారు.

    Recommended Video

    Puri Jagannath's Wife Slapped Him & The Reason Is Megastar Chiranjeevi
    రెడ్ ట్రీ బ్రాండ్‌ను మరింతగా

    రెడ్ ట్రీ బ్రాండ్‌ను మరింతగా

    రెడ్ ట్రీ బ్రాండ్‌ను రానున్న రోజుల్లో మరింత ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళికతో ఉణ్నాం. స్వచ్ఛంద సేవతోపాటు వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అందించే విషయంపై దృష్టిపెట్టాలని భావిస్తున్నాం. భవిష్యత్తులో బ్రాండ్ పేరు మీద మరిన్ని ఉత్పత్తులు తీసుకురావాలనే ప్రణాళికల్లో లావణ్యా త్రిపాఠీ, అనితా రెడ్డి తెలిపారు.

    English summary
    Actress Lavanya Tripathi latest photoshoot goes viral in social media. She has been utilizing lockdown moments with beaty and social work parallelly. Her Latest movie A1 exrpress is yet to release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X