అమలాపాల్ చర్చకు సిద్దమేనా? క్లారిటీ ఇస్తావా.. ప్రముఖ నటి సూటి ప్రశ్న
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసిన అమలా పాల్ గురించిన చర్చలే వినబడుతున్నాయి. దీనికి కారణం తాజాగా అమలా పాల్ నటించిన 'అడై' చిత్రం. ఈ సినిమా న్యూడ్‌గా కనిపించి సంచలనం సృష్టించింది అమలాపాల్. ఆమె న్యూడ్ సీన్ ట్రైలర్ లోనే చూపించి సినిమాపై హైప్ తీసుకొచ్చారు యూనిట్ సభ్యులు. అయితే ఇది కొంతవరకు సినిమాకు పాజిటివ్ అయినప్పటికీ పలువురు మహిళా సంఘాల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
మొత్తానికైతే ఎలాగోలా తమిళ్‌లో 'అడై' పేరుతో, తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా విడుదలైంది. చిత్రంలో అమలా చేసిన న్యూడ్ సీన్స్ పై మిశ్రమ స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ నటి లక్ష్మీ రామకృష్ణన్ ట్విట్టర్ వేదికగా అమలాపాల్‌ని, ఆ చిత్ర దర్శకుడిని ట్విట్టర్ వేదికగా సూటి ప్రశ్న వేసింది. ''అమలాపాల్.. నువ్వు నటించిన 'అడై' సినిమా చూశాను. ఇందులో ప్రతి సన్నివేశం సినిమా కోసం నువ్వు పడిన కష్టానికి అద్దం పడుతోంది. కాకపోతే.. నాకు కొన్ని సందేహాలున్నాయి. నాతో ఓ చర్చలో పాల్గొనడానికి నువ్వు సిద్ధమేనా? ఓ నటిగా కాదు.. ఓ తల్లిగా, సగటు ప్రేక్షకురాలిగా నిన్ను, నీ దర్శకుడు రత్నకుమార్‌ని కొన్ని ప్రశ్నలు అడగాలి'' అని పేర్కొంటూ అమలాపాల్‌ని ట్యాగ్ చేసింది. అయితే దీనిపై అమలాపాల్ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాకపోవడం విశేషం.

రత్నకుమార్ దర్శకత్వంలో వీ స్టూడియోస్‌పై అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది 'అడై/ఆమె' సినిమా. టీనేజ్ అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. విడుదలకు ముందు ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


Click it and Unblock the Notifications











