నేను కూడా బాధితురాలినే.. టాలీవుడ్ హీరోలపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్
Manchu Lakshmi: మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ రిపోర్టుపై స్పందించారు. వారికి జరిగిన చేదు అనుభవాలను దైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో మంచు లక్ష్మీ కూడా స్పందించారు. ఇండస్ట్రీలో జరుగుతున్న దారుణాలపై, టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఎలాంటి కామెంట్స్ చేసిందో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఇటీవల మంచు లక్ష్మీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ తో సినిమాల్లోకి వచ్చినా తనకు కూడా ఎలాంటి మినహింపు లేదని, తాను కూడా కొన్ని చేదు అభువానాలు ఎదుర్కొన్నానని షాకింగ్ కామెంట్స్ చేసింది మంచు లక్ష్మీ. ఇతరులు లాగా అలాంటి దారుణాలు ఎదుర్కొలేదన్నారు. 'యూ ఆర్ సో హాట్, యూ ఆర్ లూకింగ్ సో బ్యూటీపుల్, వీ షుడ్ బీ మీట్ టు గెదర్, యూ నో వీ వుడ్ మేక్ ఏ గ్రేట్ కపుల్, విల్ యూ మ్యారీ మీ'అంటూ ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చారు.

మరీ ఈ దారుణాలను ఎలా ఎదురించారని ప్రశ్నించగా.. మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. 'ఇలాంటి చెత్త వేషాలు రోడ్డున పోయే వారు చేయరు. మనకు దగ్గర ఉన్నావారు చేస్తారు. చాలా క్లోజ్ గా ఉన్నావారే చేస్తారు. ఓ రాయి వేద్దాం.. ఏముంది అనే వారు. అది కూడా ఇండస్ట్రీ వారే'అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే.. అలాంటి వారిని ఎలా ఎదుర్కొవాలో తనకు తెలుసుననీ, ఆ వారి ఆట ఎలా కట్టిడి చేయాలో తనకు బాగా తెలుసునని అన్నారు. కానీ ఈ విషయాలను మీడియా ముందు పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పేసింది.
అయితే.. ఇండస్ట్రీ చాలా చిన్నది, ఓ అగ్గిపెట్టంత. ఇందులో అన్నవాడిపై పగపెంచుకోవడం సెట్ కాదు. తెల్లారి ప్రతి ఒక్కరూ మొఖాలు చూసుకోవాలని అన్నారు. వారి ప్రవర్తన అలానే ఉంటే.. మనమే తెలివిగా వారికి దూరం ఉండటం మంచిదనీ, అలాంటి వారితో కొత్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అయినా.. తన బదర్స్ మంచు విష్ణు, మనోజ్ ఎలప్పుడు తనతో ఉండేవారనీ, వారు ఉండటంతో తన దగ్గరకి రావడానికి ఇతరులు భయపడేవారని అన్నారు.
ప్రస్తుతం హేమ కమిటీ నివేదికపై అందరూ మాట్లాడుతున్నారు. పలు టీవీ ఛానెల్స్ ల్లో చర్చలు పెడుతున్నారు. కానీ ఈ విషయం ఇంకొన్ని వారాల్లో క్లోజ్ అవుతుందనీ, ఈ కమిటీ గురించి మాట్లాడటం మానేస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలపై ప్రతి ఒక్కరూ చర్చించాలని, ఈ దారుణాలపై తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా సున్నితమైన అంశమనీ, ఫేమ్ ఉన్నవారిపై కావాలని అసత్య ఆరోపణలు చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకోచ్చారు. అలాగే.. ఎక్కడో ఏదో దారుణం జరిగితే.. సినిమాల్లో ఉన్న మగవాళ్లందరూ అలాంటి వారేనని అనడం సరికాదని అన్నారు.

ప్రతి పరిశ్రమ హేమ కమిటీ నివేదిక నుండి స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సమస్యలను పరిష్కరించాలనీ, తెలుగు ఇండస్ట్రీలోని మగవాళ్ళు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని, బయటకు వచ్చి మీటూకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇలా బయటకు వచ్చి మాట్లాడితేనే.. మహిళలు బయటకు దైర్యంగా మాట్లాడుతారని అన్నారు. అయితే.. తమపై దారుణాలు వెల్లడిస్తే.. తమకు వచ్చే అవకాశాలను కోల్పోతారని కొందరూ ఆలోచిస్తున్నారు అని మంచు లక్ష్మీ అన్నారు.
ఇదిలా ఉంటే.. మంచు లక్ష్మీ మల్టీ టాలెంటడ్ యాక్టరెస్. ఆమె నటిగానే కాకుండా నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ విలన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది. ఆమె కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. ఆమె పలు టీవీ షోస్ యాంకరింగ్ కూడా చేసింది. అలాగే.. పలు వెబ్ సిరీస్‌ల్లో
నటించింది మంచు లక్ష్మి.


Click it and Unblock the Notifications











