అజిత్ సినిమా వల్ల నా కెరీర్ నాశనం అయింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినిమాలపై ఆసక్తితో కొంతమంది ఇండస్ట్రీలో అడుగుపెడుతారు. నటిగా తమని తాము వెండితెరపై చూసుకోవాలని ఆశపడుతాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు కొందరే. మరికొంత మంది అందం, అభినయం ఉన్న అవకాశాల కోసం మూవీ మేకర్స్ తిరుగుతున్నారు. ఒక వేళ అవకాశాలు వచ్చిన అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. మరికొందరూ అవకాశాలు వచ్చిన స్టార్ డమ్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొంత మంది మూవీ మేకర్స్ ఓ పాత్ర గురించి చెప్పి మరో మరో పాత్ర ఇవ్వడం కూడా అడ్డంకిగా మారుతుంది. అలా యంగ్ హీరోయిన్ కు హీరో అజిత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని డైరెక్టర్ మోసం చేశాడంట ఇంతకీ ఏమైంది? ఆ హీరోయిన్ ఎవరు?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. తమిళ హీరోయిన్ మనో చిత్. ఈ అమ్మడు 'అవల్ పీర్ తమిళరసి' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈ అమ్మడు హీరో జై సరసన నటించింది మెప్పించింది. 2010లో విడుదలైన ఈ చిత్రానికి మీరా కతిరవన్ దర్శకత్వం వహించారు. అయితే.. ఈ సినిమా ఆశించిన అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. కానీ, హీరోయిన్ మనో చిత్ర తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Actress Mano Chitra says that her Tamil cinema career ended with Ajith Veeram movie

అవల్ పీర్ తమిళరసి సినిమా తర్వాత హీరోయిన్ మనో చిత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ క్రమంలో శీను రామసామి దర్శకత్వం వహించిన నీర్పరవై చిత్రంలో ఆమెకు లీడ్ రోల్ లో నటించే అందుకంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మకు వీరం, వేణు ఇయాన్, అండమాన్, పుధియ ముఖం, రూమ్ వంటి చిత్రాల్లో నటించారు. మనో చిత్ర తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం భాషల్లో కూడా నటించింది.

హీరోయిన్ మనో చిత్ర కు ఆట్రాక్ చేసే అందం, ఆకట్టుకునే అభినయం ఉన్న అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో హీరోయిన్ మనో చిత్ర మాట్లాడుతూ, "వీరం సినిమా కథను మూవీ మేకర్స్ తనకు చెప్పిన సమయంలో హీరోయిన్ తమన్నా సినిమా మధ్యలో చనిపోయేది. దీంతో అజిత్ కుమార్ కి జోడీగా నువ్వు ఉంటావని చెప్పారు. దీంతో నేను సంతోషంగా ఆ ఆఫర్ ని అంగీకరించాను ' అని వివరించింది.

ఆమె ఇంకా మాట్లాడూతూ..' కానీ ఆ తర్వాతే వాళ్ళు నాకు చెప్పినవన్నీ అబద్ధమని నాకు అర్థమైంది. చెప్పింది ఒకలాగా నా క్యారెక్టర్ తెరకెక్కించింది మరోలా .. ఆ సినిమాలో తాను హీరో అజిత్ కోసమే నటించా. వీరంలో నటించడం వల్ల నా మొత్తం సినిమా కెరీర్ ప్రభావితమైంది " అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వీరం సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు నా లైఫ్ టర్న్ అవుతుందిని ఆశించాను. కానీ, నాకు ఆశించిన పేరు రాలేదు. ఎందుకంటే.. నా క్యారెక్టర్ మరోలా డిజైన్ చేశారు.అందువల్ల నా జీవితం నాశమైంది' అంటు షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం హీరోయిన్ కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

More from Filmibeat

Read more about: ajith veeram mano chitra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X