నటి మీనా భర్త ఆకస్మిక మృతి.. అసలేం జరిగిందంటే.. మరణానికి కారణం అదే!
ప్రముఖ నటి మీనాకు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రాణానికి ప్రాణంగా భావించే భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణంతో ఆమె విషాదంలో మునిగిపోయింది. మీనా భర్త మృతివార్తతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమెకు అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మీనా భర్త మరణ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

2009లో వివాహం
దక్షిణాది చలన చిత్రసీమలో ముఖ్యంగా తెలుగు భాషలో అగ్రహీరోయిన్‌గా రాణించిన మీనా 2009లో వివాహం చేసుకొన్నారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్‌ను జూలై 12వ తేదీన ఆర్య సమాజ్ కల్యాణ మండపంలో పెళ్లి చేసుకొన్నారు. వీరిద్దరికి నిహారిక అనే కూతురు ఉంది.

లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో
అయితే విద్యాసాగర్ కొద్ది సంవత్సరాలుగా లివర్ ఇన్‌ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయనకు ఈ వ్యాధి పావురాల మల,మూత్ర విసర్జన వల్ల సోకిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. కొద్ది నెలలుగా ఇన్‌ఫెక్షన్ తీవ్రం కావడంతో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు అని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.

జనవరిలో కుటుంబానికి కరోనా పాజిటివ్
అయితే లివర్‌లో ఇన్‌ఫెక్షన్ జనవరి మాసంలో మరింత పెరిగింది. మీనా దంపతుల కుటుంబం మొత్తం జనవరిలో కోవిడ్ వ్యాధి బారిన పడ్డారు. ఆ తర్వాత విద్యాసాగర్‌కు ఇన్‌ఫెక్షన్ మరింత పెరిగింది. కోవిడ్‌తో కోలుకొన్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం మరింత విషమించింది అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని
అయితే విద్యాసాగర్ ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆయనకు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించారు. అయితే బ్రెయిన్ డెడ్ వ్యక్తి దొరికితే ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు ఎదురు చూశారు. కానీ అలాంటి వ్యక్తి లభించకపోవడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ జరగలేదు. అయితే ఆరోగ్యం విషమించడంతో జూన్ 28వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
అంత్యక్రియలు ఎప్పుడంటే?
విద్యాసాగర్ మరణవార్త సినీ వర్గాలను, సాధారణ ప్రజలను కలిచివేసింది. ఈ విషాదం నేపథ్యంలో మీనాకు, ఆమె కుమార్తె నిహారికకు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మీనా కుమార్తె ఇటీవల థెరీ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం అంటే జూన్ 29వ తేదీన చెన్నైలో నిర్వహిస్తారని సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











