Meena Husband Vidya Sagar: మీనా పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం.. ఎంత మంచివారంటే?

మంచి నటిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా దాదాపు సీనియర్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఒకానొక సమయంలో ఆమె అందరి కంటే బిజీ హీరోయిన్ గా కనిపించింది. ఆమె డేట్స్ దొరకాలి అంటే కొంతమంది హీరోలు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా కెరీర్లో ఎంతగానో ఆనందాన్ని చూసిన ఆమె ఇటీవల ఒక తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూయడంతో ఒక్కసారిగా మీనా కుటుంబంలో విషాదఛాయలు అల్లుకున్నాయి. అయితే మీనా విద్యాసాగర్ ను పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మంచి నటిగా..

మంచి నటిగా..

చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే మీనా నటనలో ఎంతగానో కీర్తి ప్రతిష్టలను అందుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా ఆమె జీవించేది. అందమైన యువరాణిలా అలాగే పొగరు ఉన్న అమ్మాయిలా మంచి కోడలిగా మంచి భార్యగా మంచి తల్లిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వారిలో నమ్మకం

వారిలో నమ్మకం

మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాలో ఒక స్టైలిష్ అమ్మాయి గా అలాగే మా అన్నయ్య సినిమాలో ఒక మంచి వదినగా ఆమె చూపించిన హావభావాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. మీనా ఒక పాత్ర చేస్తుంది అంటే తప్పకుండా ఆ పాత్రకు తగ్గట్టుగా న్యాయం చేస్తుంది అని దర్శక నిర్మాతల్లో ఒక బలమైన నమ్మకం కూడా ఉంటుంది. ఒక విధంగా దర్శకులు ఆలోచనల కంటే కూడా ఆమె ఒక మెట్టు ఎక్కువగానే పాత్రకు న్యాయం చేస్తుంది.

ఎన్నో పెళ్లి సంబంధాలు

ఎన్నో పెళ్లి సంబంధాలు

ఇక 2008 వరకు నటనతో బిజీగా ఉన్న సమయంలో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆమెను రిక్వెస్ట్ చేశారు. మీనాకు అంతకు ముందే కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమాలు వరుసగా వస్తుండడంతో ఆమె పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఇక 2009లో ఆమెకు విద్యాసాగర్ నచ్చడంతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది.

సరైన జోడి అని..

సరైన జోడి అని..

నిజానికి మీనాకు విద్యాసాగర్ కంటే ఎక్కువగా ఆస్తి సంపన్నులు ఉన్నటువంటి సంబంధాలు చాలానే వచ్చాయి. విదేశాల్లో బిజినెస్ మెన్ గా ఉన్న ప్రముఖులు కూడా మీనా ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. అయితే ఆమె మాత్రం వైవాహిక జీవితంలో తొందరపడకుండా అర్థం చేసుకునే భర్త దొరకాలి అని ఎదురుచూసింది. ఇక సాఫ్ట్ వేర్ అయినటువంటి విద్యాసాగర్ ను కలిసిన మొదట్లోనే తన జీవితానికి సరైన జోడి అని నిర్ణయం తీసుకొని మీనా అతనితో పెళ్లికి ఒప్పుకుంది.

ఆ ఒక్క కారణంతో..

ఆ ఒక్క కారణంతో..

సాధారణంగా అప్పటి హీరోయిన్స్ పెళ్లి చేసుకోగానే కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ విద్యాసాగర్ మాత్రం ఆ విషయంలో అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తనకు ఇష్టమైన సినిమా జీవితాన్ని కొనసాగించమని కూడా ఆమెకు ఎంతగానో సపోర్ట్ చేశాడు. ఆ ఒక్క కారణం తోనే మీనా అతని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఆనందంగా తన భర్తతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. వీరిద్దరికీ ఒక పాప జన్మించిన విషయం తెలిసిందే.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
 అప్పుడే అస్వస్థత

అప్పుడే అస్వస్థత

ఇక హ్యాపీ గా కొనసాగుతున్న సమయంలోనే కరోనా కారణంగా ఆ మధ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంత అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా మీనా భర్త ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో తీవ్ర స్థాయిలో అస్వస్థతకు గురయ్యాడు. అంతే కాకుండా అతని లంగ్స్ కూడా డ్యామేక్ కావడంతో ఇంటి పెరట్లోని పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలి కి మరింత ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. ఇక వైద్యం కొనసాగిస్తున్న సమయంలోనే అతను మరింత అనారోగ్యంతో గత రాత్రి మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా మీనా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X