twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ హీరోయిన్ కి ఊహించని షాక్.. ఆ సర్టిఫికెట్ రద్దు, ఎంపీ పదవికి గండం!

    |

    తెలుగువారందరికీ సుపరిచితమైన నటి తరువాతి కాలంలో రాజకీయ నాయకురాలిగా మారిన నవనీత్ కౌర్ కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఈ దెబ్బతో ఆమె పదవికే ఇప్పుడు గండం ఏర్పడినట్లు చెబుతున్నారు. అసలు ఏమైంది ? ఆమె పదవికి ఎందుకు గండం ఏర్పడింది అనే వివరాల్లోకి వెళితే

    కన్నడ సినిమాతో ఎంట్రీ

    కన్నడ సినిమాతో ఎంట్రీ

    దర్శన్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నవనీత్ కౌర్ తర్వాత శీను వాసంతి లక్ష్మి అనే ప్రయోగాత్మక సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. సుమారు ఆరేళ్ల పాటు ఆమె తెలుగులో సినిమాలు చేసింది. తెలుగులో క్రేజ్ రావడంతో ఆమెకు తమిళ, మలయాళ భాషల్లో కూడా అవకాశాలు దక్కాయి.

    శీను వాసంతి లక్ష్మితో క్రేజ్

    శీను వాసంతి లక్ష్మితో క్రేజ్

    తెలుగులో ఆమె జగపతి, రూమ్మేట్స్, మహారధి, టెర్రర్, జాబిలమ్మ, ఫ్లాష్ న్యూస్ లాంటి సినిమాల్లో కనిపించింది. నిజానికి చాలా సినిమాల్లో ఆమె కనిపించినా శీను వాసంతి లక్ష్మి సినిమా తెచ్చి పెట్టిన పేరు మరో సినిమా తెచ్చిపెట్టే లేదనే చెప్పాలి. అయితే చాలా కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నా కలిసి రాణి ఆమెకు రాజమౌళి యమదొంగ సినిమాలో రంభగా నర్తించే అవకాశం ఇచ్చారు.

    ప్రేమ పెళ్లి

    ప్రేమ పెళ్లి

    ఇక సినిమాలు కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరం అయిన ఈ భామ రాజకీయాల్లో బిజీగా ఉన్న రవి రానా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది. రామ్ దేవ్ బాబా ఆశ్రమంలో కలిసిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక భర్త ప్రోత్సాహంతో ఆమె మహారాష్ట్రలోని అమరావతి అనే ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానం నుంచి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. నిజానికి 2014లో రాజకీయాల్లోకి ప్రవేశించినా మొదటి సారి ప్రయత్నించినప్పుడు విజయం సాధించలేదు.

    అమరావతి ఎంపీగా

    అమరావతి ఎంపీగా

    అయితే కొన్నాళ్లపాటు నియోజకవర్గంలోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుని తీర్చిన నేపథ్యంలో ఆమె 2019 ఎన్నికల్లో గెలుపు సాధించారు. ఆమె భర్త కూడా ప్రస్తుతం అమరావతి జిల్లా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆమె ఎస్సీ కేటగిరీకి చెందిన మహిళ కాదని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొంది అక్కడి నుంచి పోటీ చేసి రాజ్యాంగాన్ని కూడా అవమానించిందని శివసేన నేత మాజీ ఎంపీ ఆనందరావు ఒక పిటిషన్ దాఖలు చేశారు.

    జరిమానా, పదవీ గండం?

    జరిమానా, పదవీ గండం?

    ఈ పిటిషన్ ను విచారించిన మహారాష్ట్ర హైకోర్టు ఆమె ఎస్సీ కేటగిరి చెందిన మహిళ కాదని నిర్ధారించి ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. అంతే కాక రెండు లక్షలు జరిమానా కూడా విధించింది. ఇక మరో ఆరు నెలల్లో ఆమె ఏ కులానికి చెందినవారో ఖచ్చితమైన సర్టిఫికెట్ తీసుకొని వచ్చి కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అయితే ఎస్సీ కాదని తేలడంతో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నిక కూడా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన నేపథ్యంలో ఆమె మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    Independent MP Navneet kaur Rana was fined ₹ 2 lakh by the Bombay High Court for submitting a fake caste certificate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X