నలుగురితో డేటింగ్ .. ఎవ్వడిలో మేటర్ లేదు , పోకిరి భామ షాకింగ్ కామెంట్స్

వెండితెరపై ఆడియన్స్‌ని అలరించడానికి సినిమాలో చాలా అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎలివేషన్స్, ఫైట్స్, డ్రామా, ఎమోషన్, అలాగే పాటలు తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటిలో దేనికదే కీలకం. ఇక పాటలతోనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలెన్నో. ఇక మాస్‌ను ఊపేసే ఐటెం సాంగ్స్‌ది వేరే కథ. వాటికి ఉండే క్రేజ్ కూడా నెక్ట్స్ లెవెల్ అని చెప్పడంలో సందేహం లేదు.

ఐటెం సాంగ్స్‌కి ఒకపుడు తెలుగు సినిమా చూసుకున్నా.. హిందీ సినిమా తీసుకున్నా ఈ పాటల్లో యాక్ట్ చేయడానికి కొందరు ఆర్టిస్టులు ప్రత్యేకంగా ఉండేవారు. వారిని చూడటానికి కుర్రకారు థియేటర్లకు పోటెత్తేవారు. మన దగ్గర జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత వంటి వారు ఐటెం సాంగ్స్‌తోనే హీరోలను మించిన స్టార్ డమ్ సంపాదించుకున్నారు. తర్వాత నెమ్మదిగా ఐటెం సాంగ్స్ హవా తగ్గడం మొదలైంది.

Actress Mumaith Khan made open up about her relations

ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌కు ఊపు తెచ్చిన నటి ఎవరైనా ఉన్నారంటే అది ముమైత్ ఖానే. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పొకిరీలో ఇప్పటికింకా నా వయసు నిండా 16 సాంగ్‌తో మాస్‌ను ఒక ఊపింది. తిరునాళ్లు, జాతరలు, తీన్ మార్ డ్యాన్స్‌ల్లో ఇప్పటికీ ఈ సాంగ్ ఉండాల్సిందే. ఈ సాంగ్ తర్వాత ముమైత్ పేరు మారుమోగిపోయింది. పోకిరి తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, మగధీర, కెవ్వు కేక వంటి సినిమాలలో ఆమె వేసిన స్టెప్స్‌కి యూత్ పూనకంతో ఊగిపోయారు. ఇక పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటిగానూ మంచి మార్కులు కొట్టేశారు ముమైత్ ఖాన్.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒడియా, డాఖినీ భాషల్లో ఆమె పలు చిత్రాల్లో నటించడంతో పాటు ఐటెం సాంగ్స్ చేశారు. ఆ తర్వాత తెలుగు తెరకు దూరమైన ముమైత్ ఖాన్ .. తిరిగి బిగ్‌బాస్ ద్వారా పలకరించారు. తర్వాత మళ్లీ కనిపించడం మానేసిన ఈ హాట్ బాంబ్.. ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

తనకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టడంతో ఇంటికే పరిమితమైనట్లు చెప్పింది. రీసెంట్‌గా ఒక బిజినెస్ పెట్టానని ముమైత్ ఖాన్ తెలిపింది. తాను నలుగురితో డేటింగ్ చేశానని.. వారిలో ఏ ఒక్కరూ నాకు కరెక్ట్ అనిపించలేదని అందుకే బ్రేకప్ చెప్పినట్లు వెల్లడించింది. నాకు భవిష్యత్తులో పెళ్లి అనేది రాసుంటే ఖచ్చితంగా చేసుకుంటానని ముమైత్ చెప్పింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ముమైత్ ఖాన్ ఎవరితో డేటింగ్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: mumaith khan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X