లూజ్‌గా ఉంటుందా? ఫిట్టుగా కావాలా? శృంగార యాడ్‌లో యంగ్ హీరోయిన్.. నెటిజన్ల ట్రోల్!
సినీ తారలు వెండితెరపైన నటిస్తూనే.. వ్యాపార ప్రకటన ద్వారా భారీగా ఆదాయాన్ని రాబట్టుకొంటారు. కొన్నిసార్లు వారు చేసే యాడ్స్ వారికి తలనొప్పులు తెచ్చిపెడుతాయి. గుట్కా, పాన్ మసాలా లాంటి యాడ్స్‌లో నటించి కొందరు స్టార్ హీరోలు వివాదాల్లో ఇరుక్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాట్ బ్యూటీ నియా శర్మ కూడా అలాంటి వివాదంలో ఇరుక్కొన్నది. మహిళలు అత్యంత సున్నితంగా భావించే యోని సంబంధిత యాడ్‌లో ఆమె నటించడంపై నెటిజన్లు గట్టిగా ట్రోల్స్‌తో బాధేస్తున్నారు. ఆ యాడ్ ఏంటి? నెటిజన్ల రియాక్షన్ ఏంటి? ఈ అమ్మడు ఓవరాక్షన్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
నియా శర్మ హిందీ వినోద రంగంలో ముఖ్యంగా టెలివిజన్ రంగంలో పాపులర్ యాక్టర్. జమాయ్ రాజా, ఖత్రోం కే కిలాడీ 8, నాగిన్ 4, సుహాగన్ చుడేల్ సీరియల్స్‌లో నటించి ఫేమ్ సంపాదించుకొన్నారు. పవిత్ర రిస్తా, కామెడీ నైట్స్ బచావో, యే రిస్తా క్యా కహ్లాతా హై, బిగ్ బాస్ 13, బిగ్ బాస్ 15 లాంటి షోల ద్వారా మరింత పాపులారిటీ సంపాదించారు.

తాజాగా యోని బిగుతుగా ఉండేందుకు వాడాల్సిన ట్యాబ్లెట్స్ గురించిన వ్యాపార ప్రకటనలో నటించారు.ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. దాంతో ఆమె తీరుపై నెటిజన్లు విరుచుకు పడ్డారు. ఇలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తావా? అంటూ ఏకీ పడేస్తున్నారు. స్త్రీలు సున్నితంగా భావించే విషయాలను ఇలా ట్రీట్ చేస్తారా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
అయితే నియా శర్మ పోస్టు చేసిన వీడియో వివరాల్లోకి వెళితే.. ఆమె వేసుకొన్న ప్యాంట్ లూజుగా ఉండటంతో చిరాకు పడింది. ఆ తర్వాత ఫ్రిజ్‌లో వాటర్ బాటిల్ తీస్తే.. మూత లూజ్‌గా ఉంది. తాను ధరించే డ్రస్ లూజ్‌గా ఉండి జారిపోతుండటం, అలాగే షూ లేస్ లూజ్‌గా ఉండటం లాంటి చూపిస్తూ..లూజ్‌గా ఉంటే చికాకు.. ఫిట్‌గా ఉంటే హాయిగా ఉంటుంది అనే విధంగా ఆమె బిహేవ్ చేసింది.

అయితే ఆ ప్రొడక్ట్ గురించి వివరిస్తూ..ఈ టాబ్లెట్ వేసుకొంటే కేవలం 30 నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది. డాక్టర్లు ఆమోదించిన ప్రొడక్ట్. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా మంది మహిళలు నమ్మకంగా వాడుతున్నారు. మీరు ఈ ప్రొడక్ట్ వాడండి.. దాని తేడా ఏమిటో మీకు వెంటనే అర్దం అవుతుంది అని నియా శర్మ యాడ్‌లో చెప్పింది.
తాను నటించి యాడ్‌కు సంబంధించిన వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి.. జీవితంలో చాలా సార్లు ఫిట్‌గా ఉండే వాటి కోసం ప్రయత్నిస్తాం. అది మీకు నచ్చే దుస్తులు కావొచ్చు. మరీ ఇంకా ఏదైనా కావొచ్చు. ఈ ప్రొడక్ట్ వాడితే మీ అంగం ఫిట్ అవుతుంది. కాబట్టి వెంటనే ట్రై చేయండి అంటూ కామెంట్ చేసింది.
అయితే ఆమె నటించిన వ్యాపార ప్రకటనపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. నియా శర్మ ప్రమోట్ చేస్తున్న వెజినా టైటెనింగ్ ప్రొడక్ట్స్ చాలా సమస్యలను తెచ్చి పెట్టడమే కాకుండా నైతికతను దెబ్బ తీస్తుంది. పబ్లిక్ ఫిగర్ హోదాలో ఉండే వాళ్లు ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటించాలో అనే విషయంపై బాధ్యతగా మసులు కోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











