బన్నీకి ప్రియురాలిగా నివేదా థామస్.. పుష్పలో రష్మిక మందన్నకు పోటీగా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రానికి సంబంధించిన వార్తలు రోజు మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ తర్వాత సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.
అయితే ఈ చిత్రంలో నివేదా థామస్ నటిస్తున్నారనే వార్త తాజాగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో నివేదా థామస్‌ను రెండో హీరోయిన్‌గా తీసుకొన్నారని సమాచారం. అల్లు అర్జున్‌కు ప్రేయసిగా కనిపించబోతున్నారు. స్క్రిప్టులో ఈ పాత్ర చాలా బలమైనది అని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం సునీల్ శెట్టిని సంప్రదించారని, అంతేకాకుండా జనవరిలో నిర్మాతలు ఆయనను కలిసి కథ, పాత్ర గురించి చెప్పారనే విషయం మీడియాలో వెలుగు చూసింది. కథ, పాత్ర గురించి తెలుసుకొన్న వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని తెలిసింది.
పుష్ప చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనావైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ప్రారంభం అవుతుంది అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











