తమిళులకి కడుపు మంట.. పవన్ కళ్యాణ్ సాయంపై నటి పాకీజా షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్స్‌గా వెలుగొందిన వారు ఇప్పుడు తినడానికి తిండి లేక పేదరికంతో జీవితాలు నెట్టుకొస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని లేడీ కమెడియన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పాకీజా అలియాస్ వాసుకి. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ కమెడియన్లతో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్‌తో పాకీజా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వయసు పైబడటంతో, కొత్త కమెడియన్ల రాకతో పాకీజాకు అవకాశాలు తగ్గిపోయాయి. తమిళంలో చిన్న చిన్న పాత్రలు, సీరియల్స్‌లో నటిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు.

పేదరికంలో మగ్గుతోన్న పాకీజా
ఒకప్పుడు తీరిక లేకుండా సినిమాలలో నటించి సంపాదించినదంతా పోగొట్టుకుని ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక పేదరికంలో మగ్గిపోతున్నారు పాకీజా. ఆమె దుస్థితి గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్ధిక సాయం చేశారు. అయినప్పటికీ భిక్షాటన చేస్తూ కనిపించడంతో మరోసారి మీడియా ప్రతినిధులు పాకీజా గురించి కథనాలు ప్రసారం చేశారు. తనకు ఎవరూ లేరని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లే తనను ఆదుకోవాలంటూ పాకీజా కన్నీటి పర్యంతమయ్యారు.

పాకీజాకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సాయం
ఈ విషయం ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి చేరుకోవడంతో ఆయన స్పందించారు. పాకీజాను గత మంగళవారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్, పీ. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు కలిసి ఆమెకు అందజేశారు. తన మొర విని ఆర్ధిక సాయం చేసిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన పాకీజా కన్నీటి పర్యంతమయ్యారు.

Actress Pakeezah Praises AP Dy CM Pawan Kalyan for his Financial Support

ఆ డబ్బంతా ఇలా ఖర్చు చేశా
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కష్టాలు, ప్రముఖులు చేసిన ఆర్ధిక సాయం గురించి వివరించింది. తన పరిస్ధితి తెలుసుకుని చాలా మంది ఆర్ధిక సాయం అందించారని, రాజమండ్రికి చెందిన ఓ అమ్మాయి తనకు 1000 రూపాయలు అకౌంట్‌లో వేసిందని, తమ ఇంటికి వచ్చేస్తే బాగా చూసుకుంటామని, మూడు పూటలా భోజనం పెడతామని చాలా మంది ఆహ్వానించారని వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు పాకీజా. ప్రముఖులు చేసిన ఆర్ధిక సాయం 7.5 లక్షల రూపాయల వరకు వచ్చిందని దాని సాయంతో 3.5 లక్షల రూపాయల అప్పును తీర్చేశానని చెప్పింది. హైదరాబాద్‌లో ఇంటి అద్దె నిమిత్తం అడ్వాన్స్, అవసరమైన సామాగ్రి కొనడం, చెన్నై, కారైకూడి, మధురై ఇలా తిరగడానికే డబ్బంతా అయిపోయిందని పాకీజా వెల్లడించారు.

10 రూపాయల ఇడ్లీ పిండితో బతికా
హైదరాబాద్‌లో అవకాశాలు రాకపోవంతో కారైకూడి వెళ్లిపోయానని అక్కడ రేకుల షెడ్డు లాంటి ఇంటికి నెలకు 1000 రూపాయలు అద్దె కట్టలేకపోయానని పాకీజా ఆవేదన వ్యక్తం చేశారు. పాచిపని చేస్తానంటే నటిని అనే వంకతో పని ఇవ్వడం లేదని, 10 రూపాయల ఇడ్లీ పిండితోనే ఆకలి తీర్చుకునేదానిని అని పాకీజా తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమ పట్టించుకోవడం లేదని.. చివరికి తమిళనాడు గవర్నమెంట్ ఇస్తానని చెప్పిన 1000 రూపాయలు కూడా రావడం లేదని వెల్లడించారు. తన పరిస్ధితి చూసి తమ్ముడు పవన్ కళ్యాణ్ విజయవాడకు పిలిపించి భోజనం పెట్టి 2 లక్షల రూపాయలు ఇచ్చారని పాకీజా చెప్పారు.

తమిళనాడు వాళ్లకు రగిలిపోతోంది
తమిళనాడులో భిక్షాటన తిరుగుతుంటే ఏపీలో మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అంత రెస్పెక్ట్ ఇస్తున్నారని ప్రశంసించారు. పవన్ నాకంటే చిన్నవాడు లేదంటే ఆయన కాళ్లు పట్టుకునే దాన్నని ఆమె అన్నారు. తమ్ముడు మధురైకి వచ్చారని, నాకు తెలిసుంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేదాన్నని తెలిపారు. తమిళనాడులో నాకు సింగిల్ టీ ఇచ్చింది లేదని .. కానీ పవన్ కళ్యాణ్ సాయం, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, తెలుగు ప్రజల ప్రేమను చూసి తమిళనాడు వాళ్లకి కడుపు మండిపోతోందని పాకీజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇంటర్వ్యూ చివరిలో బిగ్‌బాస్ ఫేం మిత్రా శర్మ తన పెద్ద మనసు చాటుకున్నారు. పాకీజా పరిస్ధితి తెలుసుకుని లైవ్ లో ఆమెకు 50 వేల ఆర్ధిక సాయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్, మిత్రా శర్మలను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

More from Filmibeat

Read more about: pawan kalyan janasena vasuki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X