Pavitra Lokesh ఆ ఇద్దరు హీరోలంటే నాకు క్రష్.. ఆ వయసులోనే ఇష్టపడ్డా.. పవిత్రా లోకేష్
నటుడు, నిర్మాత వీకే నరేష్‌తో రిలేషన్‌షిప్ తర్వాత పవిత్రా లోకేష్ అంటే తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ మరింత పెరిగింది. నరేష్‌తో బంధానికి ముందు చిన్న చిన్న పాత్రలతో రాణిస్తూ ఉండే పవిత్రకు ఆ తర్వాత మంచి గుర్తింపు లభించింది. తాజాగా మళ్లీ పెళ్లి సినిమాతో ఏకంగా ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి ఎదిగింది. ఇటీవల రిలీజైన మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పవిత్రా లోకేష్ మాట్లాడుతూ...
నరేష్‌తో సహజీవనంతో: కన్నడలో హీరోయిన్ పాత్రలతో ఆకట్టుకొన్న పవిత్రా లోకేష్ కన్నడ సినీ ప్రముఖుడితో సహజీవనం చేసింది. అయితే కొన్ని సంవత్సరాల జీవితం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సమ్మోహనం సినిమా షూటింగులో పరిచయమైన నరేష్‌తో స్నేహం కొనసాగించి.. డేటింగ్ స్థాయికి వెళ్లింది. ప్రస్తుతం వారిద్దరూ సహజీవనం చేస్తుండటం తెలిసిందే.

మళ్లీ పెళ్లి సినిమాలో కథ విషయానికి వస్తే..: అయితే తమ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మళ్లీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు. వీకే నరేష్ వైవాహిక జీవితంలో విభేదాలు, అలాగే పవిత్ర లోకేష్ సహజీవనం బ్రేకప్ కావడమనే అంశాల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాలో చూపించిన ప్రకారం.. పవిత్రా లోకేష్ జీవితంలో జరిగిన సంఘటన ప్రతీ ఒక్కరిని ఆవేదనకు గురిచేసే విధంగా ఉంది.

నాకు ఆ హీరో అంటే క్రష్:
మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్‌లో భాగంగా పవిత్ర నరేష్ మాట్లాడుతూ.. నాకు ఇద్దరు హీరోల అంటే క్రష్ తెలిపింది. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు నాగార్జున అక్కినేని నటించిన గీతాంజలి సినిమా వచ్చింది. ఆ సినిమాలో నాగార్జునను చూసిన తర్వాత నాకు ఆయనంటే క్రష్ ఏర్పడింది. నాకు భర్తంటే ఉంటే అలాంటి వ్యక్తి ఉండాలనే ఫీలింగ్ కలిగింది అని చెప్పారు.

ప్రకాశ్ రాజ్ అంటే నాకు క్రష్: అలాగే నాగార్జున అక్కినేని తర్వాత ఆ రేంజ్‌లో నాకు నచ్చిన వ్యక్తి నటుడు ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ అంటే నాకు ఒక క్రష్. ఈ ఇద్దరు తప్ప మరెవరిపై కూడా నాకు క్రష్ ఏర్పడలేదు అని ఓ ఇంటర్వ్యూలో పవిత్ర లోకేష్ తన అనుభూతులను పంచుకొన్నది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది.

మళ్లీ పెళ్లి మూవీ గురించి: ఇక మళ్లీ పెళ్లి సినిమా విషయానికి వస్తే.. వీకే నరేష్, పవిత్రా లోకేష్ నటించిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ ఏర్పడింది. వీరిద్దరి పాత్రలను, సంఘటనలు ఎంఎస్ రాజు ఫీల్‌గుడ్‌గా డిజైన్ చేశారు. ఎక్కడా సెన్సేషనలైజ్ చేయకుండా కంటెంట్‌తోపాటు పక్కా స్క్రీన్ ప్లేతో సినిమా కథను కొనసాగించారు.


Click it and Unblock the Notifications











