ఆయనతో కమిట్ కాలేదు.. సోషల్ మీడియాలో పాయల్ క్లారిటీ

నట సింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం సెట్స్‌పైన ఉండగానే వరుస సినిమాలతో జోష్ కొనసాగిస్తున్నారు. అయితే NBK106 పేర్కొనే ఈ సినిమాలో యువ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే బాలకృష్ణ సరసన నటించే విషయంపై పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు.

బాలకృష్ణతో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని పాయల్ రాజ్‌పుత్ క్లారిటీ ఇచ్చింది. అందరికి నమస్కారం. నా నుంచి మీకు ముఖ్యమైన సమాచారం అందిస్తున్నాను. ఇప్పటి వరకు ఏ సినిమాను అంగీకరించలేదు. బాలకృష్ణ సార్‌తో నటిస్తున్నాననే వార్త ఓ రూమర్ అంటూ పాయల్ ట్వీట్ చేసింది.

Actress Payal Rajput clarity Balakrishna movie

వాస్తవానికి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార, అనుష్క శెట్టి, శ్రీయాసరన్, క్యాథరీన్ త్రెసా పేర్లు వినిపించాయి. చివరకు పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నట్టు వార్తలు రావడం జరిగింది. దాంతో పాయల్ స్పందించాల్సి వచ్చింది.

ఇక బాలయ్య, బోయపాటి సినిమా విషయానికి వస్తే.. డిసెంబర్‌లోనే పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తాజాగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అంతలోనే కరోనావైరస్ రావడంతో షూటింగ్ వాయిదా పడింది. మళ్లీ ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X