త్రివిక్రమ్ పై మరోసారి విరుచుకుపడ్డ పూనమ్ కౌర్.. సంచలనం రేపుతున్న ట్వీట్..
Poonam kaur: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది నటి పూనమ్ కౌర్. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ సంచలన ఆరోపణలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి ట్విట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం ట్విట్ చేసింది? ఆ ట్విట్ ఏం కామెంట్స్ చేసిందో ఓ లుక్కేయండి.
టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉండేది. కానీ గత కొంతకాలంగా సినిమాలకు దూరమైంది. ఈ అమ్మడు తొలుత శ్రీకాంత్ హీరోగా నటించిన 'మాయాజాలం' సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. తెలుగు సినిమాతో తన అందం అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శౌర్యం, నిక్కీ అండ్ నీరజ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి? వంటి పలు చిత్రాలలో నటించి మెప్పించింది పూనమ్ కౌర్. చివరిగా నాతిచరామి అని సినిమాలో కనిపించింది.

అయితే.. ఈ మధ్యకాలంలో సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలోనైనా.. తన కాంట్రవర్సీలతో, ట్విట్లతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ట్విట్స్ లో ఎక్కువగా డైరెక్టర్ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లను పరోక్షంగా కామెంట్స్ చేస్తూ.. నెటిజెన్ల నోళ్లల్లో నానుతోంది. అసలు ఏం జరిగిందని నెటిజెన్స్ ప్రశ్నించిన వాటికి సమాధానం ఇవ్వకుండా.. అసలు మేటర్ ఏంటో క్లారిటీ ఇవ్వకుండా ఇష్టం ఉన్నట్లు కామెంట్స్ చేస్తూనే ఉంటుంది.
గతంలోనే తాను డైరెక్టర్ త్రివిక్రమ్ పై మా అసోషియేషన్ లో కంప్లీట్ చేశానంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. అసలు ఏం జరిగిందో? వారి మధ్య ఎలాంటి మంతనాలు జరిగాయో? ఆ విషయమేంటో వారికి మాత్రమే తెలుసు. కానీ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తూ సస్పెన్స్ మీద సస్పెన్స్ ఇస్తుంది.

కాసేపటి తర్వాత ఇంకో ట్విట్ చేసింది ఈ అమ్మడు. అటు ఇటు గమనిస్తే.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని గుర్తుకు చేసి మరీ కౌంటర్ వేసినట్లు ఉంది. 'నువ్వు ఎవరన్నరది కాదు.. నువ్వు ఏం చేస్తున్నావ్ అన్నది ముఖ్'యం అని అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి చేసిన పనిని గుర్తుకు చేసినట్టు ఉంది.


Click it and Unblock the Notifications











