త్రివిక్రమ్‌ వల్లే నీకు ఓటమి.. నీ కెరీర్ నాశనం.. కేటీఆర్‌పై పూనమ్ కౌర్ ఘాటుగా!

కేంద్ర మంత్రి తనయుడిపై ఫోక్సో కేసు నమోదు కావడమే విషయం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనకు ముందు చోటు చేసుకొన్న ఈ సంఘటన భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఆందోళనకు గురి చేసింది. అయితే ఈ వ్యవహారంపై పలు రాజకీయ పక్షాలు తమదైన శైలిలో విమర్శలు, ఆరోపణలు గుప్పించాయి. అయితే మంత్రి కుమారుడి వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఘాటుగా స్పందించారు. అయితే ఆయన స్పందనపై సినీ నటి పూనమ్ కౌర్ మరింత ఘాటుగా స్పందించారు. కేటీఆర్ ఏం ట్వీట్ చేశాడు? దానికి ప్రతిగా పూనమ్ కౌర్ ఏమని రియాక్షన్ ఇచ్చిందనే వివరాల్లోకి వెళితే..

ఇంతకు ఎవరు నిందితులు?.. కుమారుడు చేసిన నీచమైన పని, ఆ తర్వాత పెట్టిన కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తన అధికారాన్ని హోదాను ఉపయోగిస్తున్నారు. ఈ దారుణమైన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మౌనం దాల్చింది. మైనర్ బాలిక తల్లిదండ్రులు పోక్సో కేసు నమోదు చేస్తే.. సర్కారు తనకు ఏమీ పట్టనట్టు చెవిటితనంతో వ్యవహరిస్తున్నది. ఘోరమైన నేరం సంభవిస్తే.. తెలుగు మీడియా రిపోర్ట్ చేయడానికి నిరాకరిస్తున్నది. బేటీ బచావో అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Actress Poonam Kaur pot Shots at KTR

అయితే కేటీఆర్ చేసిన ట్వీట్‌‌పై పూనమ్ కౌర్ షార్ప్‌గా ఎటాక్ చేశారు. నీవు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు. అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం వల్ల ఓ ఆడపిల్ల జీవితం, కెరీర్ నాశనమైంది. త్రివిక్రమ్ నాకు చేసిన ద్రోహం గురించి కేకే రావుకు ఫిర్యాదు చేస్తే.. నీవు ఎందుకు పట్టించుకోలేదు. ఆ కారణంగానే.. త్రివిక్రమ్‌తో ఉన్న నీ బాండింగ్ కారణంగానే నీవు ఓటమి పాలయ్యావు. నీ కెరీర్ కూడా నాశనం మైంది. స్వచ్ఛంగా ఉండాలి. రాజకీయాల కోసం న్యాయాన్ని పణంగా పెట్టకూడదు అంటూ పూనమ్ కౌర్ ఘాటుగా స్పందించింది.

Also Read
బాలకృష్ణతో అలాంటి అనుభవం.. సెట్‌లో నాతో ఆ రోజు అలా.. ఊర్వశి రటేలా
బాలకృష్ణతో అలాంటి అనుభవం.. సెట్‌లో నాతో ఆ రోజు అలా.. ఊర్వశి రటేలా

అయితే పూనమ్ కౌర్ రియాక్షన్ గురించి కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఆమె చేసిన ట్వీట్‌కు ఏదైనా బదులిస్తాడా? లేక ఆమె రియాక్షన్‌కు ఇంతటితో పుల్‌స్టాప్ పెడుతారా? అని విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పూనమ్ చేసిన కామెంట్లకు ఆయన ఏమని బదులిస్తాడు అనే విషయం చర్చనీయాంశమౌతున్నది.

Recommended For You
త్రిష డ్రీమ్ నిజం కాబోతున్నదా? 22 ఏళ్ల కోరిక తీరబోతున్నదా?
త్రిష డ్రీమ్ నిజం కాబోతున్నదా? 22 ఏళ్ల కోరిక తీరబోతున్నదా?

గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో పలు ఆరోపణలు చేస్తున్నది. ఆర్టిసుల యూనియన్ మాకు, నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసింది. కానీ వారి నుంచి కూడా ఆమెకు ఎలాంటి సపోర్ట్ దక్కలేదు. అయినా ఆమె తన పోరాటాన్ని, విమర్శలు, ఆరోపణలు సోషల్ మీడియాలో చేస్తూనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X