2008 అమ్మాయిలతో అశ్లీల వీడియోలు.. ఆ మంత్రి కొడుకు జంతువు కంటే హీనం.. పూనమ్ కౌర్ షాకింగ్ వీడియో
కర్ణాటకలో మంత్రి కుమారుడు దాష్టీకాలపై సినీ నటి పూనమ్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ మంత్రి హెచ్‌డీ రేవన్న కుమారుడు, ప్రస్తుతం హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న మహిళలను లోబరచుకొని బలవంతంగా అశ్లీల వీడియోలు తీసిన దారుణంపై పూనమ్ కౌర్ వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి దుర్మార్గులకు ఓటు వేస్తే దేశంలో ఆడ బిడ్డకు రక్షణ ఉండదు.. న్యాయం జరగదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ..
ఓ మినిస్టర్ కొడుకు ఓ అమ్మాయి ఫోన్ ట్యాప్ చేశారని వింటాం. మరో మినిస్టర్ కొడుకు గుట్టపై నుంచి అంకిత అనే అమ్మాయిని తోసేసిందని వింటాం. మరో అమ్మాయిని ఓ మినిస్టర్ కొడుకు బ్లాక్ మెయిల్ చేస్తారని వింటాం. మరో మినిస్టర్ అమ్మాయిపై అఘాయిత్యం, మానభంగం చేసి తప్పించుకొంటాడు. ఇవన్నీ ఇప్పటి వరకు విన్నాం అని తాజా వీడియోలో పూనమ్ కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కానీ తాజాగా ప్రజ్వల్ అనే అమ్మాయిపై దారుణంగా వ్యవహరించిన వ్యక్తి కర్ణాటక మంత్రి కుమారుడు. అతడు బలవంతంగా 2008 మంది అమ్మాయిలతో అశ్లీల వీడియోలు తీయడం దారుణం. మానవులు ఎవరూ చూడని విధంగా, జుగస్పకరంగా వీడియోలు తీశాడు. ఆ దుర్మార్డుడిని ఎవరు ఏం చేయలేకపోయారు. కారణం అతడి వద్ద అధికారం, డబ్బు ఉండటమే అని పూనమ్ కౌర్ ఫైర్ అయింది.
ఆ నీచుడిని మనం ఎంచుకొన్న ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఆ వ్యక్తి ప్రస్తుతం జర్మనీకి పారిపోయాడు. మనమంతా కలిసి ఉద్యమం చేసి.. వారిపై ఒత్తిడి తెస్తే గానీ.. ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోడం సాధ్యం కాదు. ఈ అంశంపై కొందరు రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తారు. కానీ బాధితులకు న్యాయం జరగదు. నేరస్థుడికి శిక్ష వేస్తారనే గ్యారెంటీ మాత్రం ఉండదు అని పూనమ్ కౌర్ వీడియోలో ప్రశ్నించార

కాబట్టి మీ అందరికి రెండు చేతులు ఎత్తి.. ప్రతీ మహిళకు, ప్రతీ ఆడబిడ్డకు, ప్రతీ సోదరుడికి వేడుకొంటున్నాను. మీరు ప్రేమించే మీ కూతురు, సోదరి కోసం న్యాయం జరగాలంటే.. మీరు ఓటు వేసేటప్పుడు.. మహిళను నారిశక్తి భావించే వ్యక్తికి ఓటు వేయాలి. మహిళలతో అశ్లీల వీడియోలు చేసే వారికి, ఆడవాళ్లపై దౌర్జన్యం చేసే వారికి ఓటు వేయొద్దు అని పూనమ్ కౌర్ విన్నవించుకొన్నారు.

మహిళలపై లైంగిక దాడులు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేసే వారు.. దేశాన్ని పాలించే పెద్ద పదవుల్లో ఉంటే.. ఈ దేశపు ఆడ బిడ్డల పరిస్థితి ఏమిటి? అందుకోసమే.. నేను ఓ నినాదం తీసుకొచ్చాను. ఈ నా సందేశం ప్రతీ ఆడబిడ్డకు చేరాలనే ప్రయత్నం చేస్తున్నాను. దాంతో దేశంలోని ప్రతీ మహిళ జాగృతం అయితే.. ఈ దేశంలోని ఆడ పిల్లకు న్యాయం జరుగుతుంది అని అన్నారు.
మహిళ శక్తి మేల్కొంటే.. అమ్మాయిలపై రేప్ చేసే వారు.. 2008 మంది అమ్మాయిలతో బలవంతంగా వీడియోలు తీసే వ్యక్తిని చూస్తే.. జంతువు కూడా ఇలాంటి పనిచేయదనిపిస్తుంది. కాబట్టి ఈ దేశ భవిష్యత్తు, మహిళల సురక్ష మీ చేతిలో ఉంది. మన దేశపు రావణ రాజ్యం కావాలా? రామరాజ్యం వైపు అడుగులు వేయాలా? అనేది మీ చేతిలోనే ఉంది. చివరగా మీకు చెప్పేది ఏమిటంటే.. ప్రతీ మహిళ మేల్కొంటే.. ఈ దేశంలో ఆడపిల్ల బతుకుతుంది.. జై హింద్ అంటూ ఉద్వేగభరితమైన సందేశాన్ని పూనమ్ కౌర్ వీడియో ద్వారా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











