పూనమ్ కౌర్‌కి పిచ్చి పట్టిందా .. అల్లు అర్జున్‌పై ఇలాంటి పోస్టులా
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఓ రేంజ్‌లో వినిపిస్తున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది పుష్ప 2 అని అందరికీ తెలుసు. ఈ సినిమాతోనే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎంత టెన్షన్ వాతావరణం కనిపించిందో అందరికీ తెలిసిందే. అక్కడ నుంచి ఈ సినిమా ఈవెంట్ లో పలు కాంట్రవర్సీలు, రిలీజ్ కి ముందు తొక్కిసలాట ఇలా పలు షాకింగ్ ఇన్సిడెంట్స్ నడుమ ఒక పెద్ద హైడ్రామానే నడిచింది అని చెప్పాలి.
ఈ అన్నిటి నడుమ వచ్చినప్పటికీ పుష్ప 2 తో అల్లు అర్జున్ సెన్సేషనల్ హిట్ కొట్టేసి ట్రూ పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నాడు. కానీ తన విషయంలో జరిగిన ఘటనలు మాత్రం ఎవరూ మార్చలేరు కదా. పుష్ప 2 రిలీజ్ కి ముందు రోజు జరిగిన ఘటనలో ఓ కుటుంబంలో జరిగిన విషాదం కూడా ఒకటి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలోని సంధ్య 70MM థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అందరికీ తెలిసిందే.

ఈ ఘటనలో ఇపుడు అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం అనే వార్త తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఓ పక్క అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ కొట్టడం, ఇంకోపక్క అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరో అరెస్ట్ కావడం అనేది ఇపుడు షాకింగ్‌గా మారింది. దీనితో ఇది తన సినిమాని మించిపోయిన వార్తగా మారి సంచలనం సృష్టిస్తోంది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఎవరైనా సీరియస్‌గా స్పందిస్తే సజావుగా ఉంటుంది . కానీ అలా కాకుండా వెటకారంగానో సంబంధం లేకుండా ఇన్‌డైరెక్ట్‌గా గిచ్చేలా లాంటివి చేస్తే ఎలా ఉంటుంది? ఇపుడు సినీనటి పూనమ్ కౌర్ వ్యవహారం అలానే ఉందని చెప్పాలి. మెగా కుటుంబం అండ్ ఓ మెగా హీరో సహా ఓ దర్శకుడు విషయంలో పూనమ్ కౌర్ ఎప్పుడు నుంచో సోషల్ మీడియాలో పలు షాకింగ్ పోస్టులు చేస్తుంది అని అందరికీ తెలిసిందే.
కాగా ఇపుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి పెద్ద వివాదం జరుగుతుంటే.. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫెవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ తనతో కలిసి దిగిన ఓ పాత ఫోటో షేర్ చేసి షాకిచ్చింది. దీనితో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి. ఇది వరస్ట్ టైమింగ్ అని అటెన్షన్ కోసమే పోస్ట్ చేసింది అంటూ పూనంపై విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కోసం సంఘీభావం తెలిపితే సమంజసంగా ఉంటుంది. కానీ అది వదిలేసి ఇలాంటి పోస్ట్ లు పెట్టడం మాత్రం పూనమ్ కౌర్ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరి ఇలాంటి పరిస్ధితుల్లో ఈ తరహా వింత పోస్ట్ పెట్టడం వెనుక మతలబు ఏంటో ఆమెకే తెలియాలి.


Click it and Unblock the Notifications











