twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనపై గౌరవంతో కవిత రాశా.. పూనమ్ కౌర్ పోయెట్రీ వైరల్

    |

    సినీ పరిశ్రమలో ప్రముఖుడు, మాట రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయనలో ఆధ్యాత్మిక సాహితీ వేత్త. శివతత్వాన్ని అవపోసన పట్టిన భక్త. తెలుగుతెర తోట రాముడు తనికెళ్ల భరణి. 'మిథునం'లో అప్ప దాసు, బుచ్చి లక్ష్మి పాత్రలకు ప్రాణం పోసిన దర్శక సృష్టి. రచయితగా, దర్శకుడిగా విభిన్న పాత్రలకు ప్రాణం పోసిన ఆయన, నటుడిగా వచ్చిన అవకాశాలకు అంతే అందంగా జీవం పోశారు. తెరపై పాత్రలు తగ్గట్టు విలక్షణ, వైవిధ్యమైన నటన కనబర్చిన తనికెళ్ల భరణి, తెర తీసిన తర్వాత నిజజీవితంలో నటన అనే కళను అవపోసన పట్టలేకపోయారు.

    తనికెళ్ల భరణి ఒక మాట రాసినా, తెరపై నటుడిగా ఒక మాట చెప్పినా... గోడ కట్టినట్టు, గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు పద్దతిగా ఉంటుంది. ఆయన గురించి అంతే పద్దతిగా, చక్కగా నటి పూనమ్ కౌర్ ఒక కవిత రాశారు. తనికెళ్ల భరణి జీవితంలో పూనమ్ కౌర్ పరకాయ ప్రవేశం చేసినట్టు, ఆయన ఆత్మ ఆమెను ఆవహించినట్టు.... రాశారంటే అతిశయోక్తి కాదు.

    Actress Poonam Kaur writes poetry about Actor

    పూనమ్ కౌర్ మాట్లాడూతూ "భరణి గారికి గురు గోబింద్ సింగ్ జీ అంటే ఎంతో గౌరవం. బైసాఖి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో చాట్ నిర్వహించాను. నా తరపున ఆయనకు ఈ కవిత వినిపించా. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నట్టు నేను రాసిన కవిత" అని అన్నారు.

    పూనమ్ కౌర్ రాసిన కవిత:

    ఔను....
    నేను నటుడినే.
    కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.
    ఔను ...
    నేను ఒక కళాకారుడినే.
    కానీ, కళామతల్లి మీద
    ప్రేమ, అభిమానంతో,
    కళ విలువ తెలియకుండా
    నా దగ్గరకి వచ్చే
    ప్రతి మనిషికి నేను
    నా కళని అమ్ముకోలేకపోయాను.
    సాహిత్యం పట్ల ప్రేమతో,
    మన భారత దేశంలో ఉన్న
    సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని
    ఒక చిన్న ఆశ.
    ఆ భావంతో,
    మనసు నిండా అదే ఆలోచనతో
    నేను నా ప్రతి నాటకం రాశా.
    డబ్బు గురించి మాట్లాడితే
    అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను.
    అమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రేమతో,
    కరుణతో, మర్యాదతో వచ్చినపుడు
    శిరసు వంచి అందుకున్నాను.
    నా దగ్గరకి వచ్చిన మనిషి
    అహంభావం చూపించినా,
    నేను ప్రేమతోనే చూశాను.
    కానీ,
    నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం
    ఏరోజూ అహంతో పంచుకోలేకపోయాను.
    వెనకడుగు వేసే ప్రతి నిమిషం
    కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి.
    కానీ నా స్వార్ధం కోసం
    నేను అత్యంత గౌరవాన్ని ఇచ్చే
    కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.
    పూజ చేశాక,
    మా ఆవిడ నా నుదిటిన పెట్టిన బొట్టుతో
    నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది.
    నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను
    అని మా ఆవిడ అంటే,
    నీ సహాయం లేకుండా
    ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.
    పిల్లలందరిని నేను కోరుకునేది ఒకటే.
    అమ్మ అనే బంధానికి ప్రేమని పంచండి.
    నాన్న అనే పదంతో స్నేహం పెంచుకోండి.
    ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశల్లేని
    నేను.....
    మీ
    తనికెళ్ళ భరణి

    తనికెళ్ల భరణి ఆత్మలోకి ప్రవేశించినట్టు పూనమ్ రాసిన కవితకు నెటిజన్ల నుంచి, సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి.

    English summary
    Actress Poonam Kaur writes poetry about Actor, Writer Tanikella Bharani. She shows special respect on him thru words.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X