45 రోజులుగా టార్చర్.. రోజూ నీ వల్ల ఏడుస్తున్నా.. హీరోయిన్ పూర్ణ భర్త షాకింగ్ పోస్ట్
సీమటపాకాయ్, అవును చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సినీ నటి పూర్ణ. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డిమాండ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్‌డమ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అది తనకు సాధ్యం కాదని ముందే గ్రహించి హీరోయిన్ రోల్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కీలకపాత్రలు పోషిస్తూ తన హవా సాగిస్తున్నారు. తాజాగా పూర్ణను ఉద్దేశిస్తూ ఆమె భర్త పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
శ్రీమహాలక్ష్మీతో టాలీవుడ్ ఎంట్రీ
కేరళలోని కన్నూర్‌కు చెందిన పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిం. చిన్నప్పటి నుంచి డ్యాన్సర్‌గా ప్రశంసలు అందుకున్న ఆమె తర్వాత సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 2004లో మలయాళ చిత్రం మంజు పొలొరు పెన్‌కుట్టి సినిమాలో నటించారు. ఆ తర్వాత 2007లో రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి హీరోగా వచ్చిన శ్రీమహాలక్ష్మీ సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఈ సినిమాతో పూర్ణ సౌత్‌లో ఫేమ్ సంపాదించారు. సీమటపాకాయ్, అవును, లడ్డూ బాబు, నువ్విలా నేనిలా, అవును 2, రాజుగారి గది, మమ మంచు అల్లుడు కంచు, జయమ్ము నిశ్చయంబురా, సిల్లీ ఫెలోస్, సుందరి, అఖండ, దృశ్యం 2, దసరా, భీమ తదితర చిత్రాల్లో నటించారు.

స్పెషల్ సాంగ్స్‌తో రచ్చ
హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ పూర్ణ అలరించారు. తమిళంలో రాజాధి రాజా, తెలుగులో శ్రీమంతుడు, గుంటూరు కారం తదితర చిత్రాల్లో ఆమె సాంగ్స్ మాస్‌ను ఊపేశాయి. బుల్లితెరపై పూర్ణ తన ముద్ర వేశారు. తెలుగులో సిక్స్త్ సెన్స్, ఢీ తదితర చిత్రాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని వివాహం చేసుకున్నారు పూర్ణ. 2022లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత గర్భం దాల్చిన పూర్ణ.. 2023 ఏప్రిల్ 10న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నాటి నుంచి భర్త, బాబుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పూర్ణ. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా కుటుంబంతో గడుపుతుంటారు పూర్ణ.
పెళ్లయినా నటిగా కంటిన్యూ
పెళ్లయి, పిల్లలు పుట్టినప్పటికీ నటిగా, జడ్జిగా కొనసాగుతున్నారు పూర్ణ. తన భర్త అందించే సహకారమే దీనికి కారణం, ఈ విషయంలో తాను ఎంతో అదృష్టవంతురాలినని పూర్ణ పలుమార్లు తెలిపారు. తాజాగా పూర్ణను ఉద్దేశించి ఆమె భర్త అసిఫ్ అలీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలు, షూటింగ్స్, బిజీ కారణంగా తాను తన భార్య దూరంగా ఉండాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 45 రోజులుగా నరకం అనుభవిస్తున్నానని.. ఈ ఒంటరితనాన్ని భరించలేకపోయానని ఆయన పోస్ట్ పెట్టారు.
కన్నీరు ఆగడం లేదు
రాత్రుళ్లు నీ జ్ఙాపకాలతో గడిపేశానని, ప్రతిరోజూ ఉదయం నిన్ను తల్చుకుని ఏడ్చేసేవాడినని అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో నీ గొప్పదనం, ప్రేమ గొప్పదనం నాకు తెలిసొచ్చిందని ఆయన రాసుకొచ్చారు. ఎట్టకేలకు తన భార్య తన దగ్గరికి తిరిగొచ్చేసిందని.. ఎంతో నిరీక్షణ తర్వాత ఆమెను కలుసుకోవడంతో కన్నీరు ఆగడం లేదంటూ పోస్ట్‌లో తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పూర్ణ- అసిఫ్‌ల అనుబంధాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











