బాలకృష్ణ, వెంకటేష్‌తో హీరోయిన్ పూర్ణ.. వరుస ఆఫర్లతో బ్యూటీ హంగామా!
టాలీవుడ్ నటి, కొరియోగ్రాఫర్, యాంకర్ పూర్ణ కెరీర్ పరంగా మంచి ఆఫర్లను సొంతం చేసుకొంటున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ నటించే 106 చిత్రంలో కీలక పాత్రను దక్కించుకొన్న ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న దృశ్యం 2 చిత్రంలో నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్‌ను సొంతం చేసుకొన్నారు. మలయాళం దృశ్యం2లో లాయర్ పాత్రలో కనిపించిన శాంతి ప్రియ ధరించిన పాత్రను పూర్ణ చేస్తున్నట్టు తెలిసింది.
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా నటించిన దృశ్యం 2 మలయాళంలో భారీ విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించేందుకు సిద్ధంకాగా, కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం ఆరంభమైన సంగతి తెలిసిందే.

దృశ్యం2 సినిమాను శరవేగంగా పూర్తి చేసి అంటే.. 50 రోజుల్లో ముగించి ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
ఇక పూర్ణ కెరీర్ విషయానికి వస్తే.. యాంకర్‌గా రాణిస్తూనే వరుసగా సినిమా ఆఫర్లను సొంతం చేసుకొంటున్నారు. దర్శకుడు కర్రి బాలాజీ రూపొందించే బ్యాక్‌డోర్ చిత్రంలో పూర్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











