రొమాంటిక్ లుక్స్‌తో అదరగొట్టిన పూర్ణ.. వైరల్‌గా బ్యాక్‌డోర్ టీజర్
లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాకు భారీగా ఆదరణ పెరిగింది. కంటెంట్ ఉంటే చాలూ సినిమాను ప్రేక్షకులు మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నారనే విషయాన్ని చిన్న సినిమాలు నిరూపించాయి. ఇలాంటి కోవలోకి చెందిన చిత్రం బ్యాక్‌డోర్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వైభవంగా జరిగింది.
బ్యాక్ డోర్ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కె.ఎస్.రామారావు, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, ప్రముఖ దర్శకులు వీరశంకర్, సంతోషం సురేశ్, ప్రముఖ నటులు, నిర్మాత కే అశోక్ కుమార్, ఈ చిత్ర దర్శకుడు కర్రి బాలాజీతో "ఆనంద భైరవి" నిర్మిస్తున్న బి.తిరుపతిరెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ రఘు, చిత్ర నిర్మాత బి.శ్రీనివాసరెడ్డి, పొలిటీషియన్ తిరుమలేష్ నాయుడు, దర్శకుడు కర్రి బాలాజీ, సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ రెడ్డి, కథానాయకుడు తేజ త్రిపురాన.. హీరోయిన్ పూర్ణ, పబ్లిసిటీ డిజైనర్ విక్రమ్ రమేష్, మేనేజర్ కళ్యాణ్ సుంకర, ప్రొడక్షన్ డిజైనర్ విజయ తదితరులు పాల్గొన్నారు.

కాన్సెప్ట్ బేస్ట్‌గా రూపొందిన బ్యాక్ డోర్ టీజర్‌లో హీరోయిన్ పూర్ణ, తేజ మధ్య సన్నివేశాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. పూర్ణ, తేజ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్టు తెరపైన కనిపించింది. టీజర్ ఆద్యంతం ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్లతో కనిపించింది.

ఇక బ్యాక్ డోర్ టీజర్ గురించి అతిథులు మాట్లాడుతూ.. పూర్ణ, తేజ నటించిన సినిమా టీజర్ చాలా బాగుంంది. దర్శకుడు బాలాజీ ప్రతిభ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపించింది. నంది అవార్డు గ్రహీత బాలాజీ బ్యాక్ డోర్‌తో మరిన్ని అవార్డులు గెలుచుకోవాలి. పూర్ణ కెరీర్‌లో మరో మంచి హిట్ ఫిల్మ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని అన్నారు.

తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత బి శ్రీనివాస్‌రెడ్డికి కర్రి బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర సమర్పకులు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్‌తోపాటు... సినిమా అద్భుతంగా వచ్చేందుకు సహకరించిన హీరోయిన్ పూర్ణ, హీరో తేజలకు కర్రి బాలాజీ థ్యాంక్స్ తెలిపారు.
బ్యాక్ డోర్ చిత్రం నా జీవితంలో మైలు రాయిగా నిలిచిపోతుంది. దర్శకుడు బాలాజీ ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తెరకెక్కించారు అని హీరోయిన్ పూర్ణ అన్నారు. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు, నటనలో తనకు ఎన్నో సూచనలిచ్చిన పూర్ణకు చిత్ర కథానాయకుడు తేజ కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్కిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ సమర్పణలో బీ శ్రీనివాస్‌రెడ్డి నిర్మిస్తున్న బ్యాక్ డోర్ చిత్రానికి ప్రతిభవంతులైన సాంకేతిక వర్గం పనిచేసింది.
కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ,
పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్
కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ
పాటలు: నిర్మల, చాందిని
సంగీతం: ప్రణవ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్
ఆర్ట్: నాని
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్,
కెమెరా: శ్రీకాంత్ నారోజ్,
ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్ కోట
పిఆర్వో: ధీరజ్ అప్పాజీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ,
కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను,
సమర్పణ: సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి
రచన, దర్శకత్వం: కర్రి బాలాజీ!!


Click it and Unblock the Notifications











