48 ఏళ్ల వయసులో నటి ప్రగతి సరికొత్త చరిత్ర.. రేర్ రికార్డ్ కొట్టిన బ్యూటీ
తల్లి, అక్క, వదిన తదితర పాత్రలు పోషిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రగతి. హీరోయిన్లను మించిన అందంతో వెలిగిపోయే తనను చిన్న వయసులోనే తల్లి పాత్రలో నటింపజేయడంపై ప్రగతి అభిమానులు ఫైర్ అవుతుంటారు. సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ప్రగతి రేర్ రికార్డ్ కొట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
మోడల్ టూ యాక్టర్
ఏపీలోని ఒంగోలుకు చెందిన ప్రగతి తొలుత మోడల్‌గా పనిచేశారు. పలు టాప్ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. తర్వాత సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అదృష్టం పరీక్షించుకున్నారు. తమిళ సీనియర్ నటుడు భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన వీట్ల విశేషాంగ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. తన అందం, నటనతో తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగతి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో బిజీ అయ్యారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి కావడంతో ప్రగతి నటనకు దూరం కావాల్సి వచ్చింది.

చిన్న వయసులోనే తల్లిపాత్రలు
తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయిన ప్రగతి ఈసారి సీరియల్స్‌లో తన హవా సాగించారు. ఈ దశలో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడంతో పాతికేళ్ల వయసులోనే హీరో, హీరోయిన్లకు తల్లిగా, వదినగా, అక్కగా బరువైన పాత్రలను పోషించారు. తన కంటే వయసులో పెద్దవారికి తల్లిగా నటించే సమయంలో ఇబ్బంది పడినట్లు ప్రగతి పలుమార్లు వివరించారు. పెళ్లి చేసుకోవడం జీవితంలో తాను చేసిన పెద్ద తప్పని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నచ్చినట్లు బతుకుతున్న ప్రగతి
మనసులో ఏమున్నా సరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ప్రగత స్టైల్. తన దినచర్య, రోజువారీ కార్యక్రమాలు, సినిమాలు, ఇతర వివరాలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 48 ఏళ్ల వయసులోనూ నచ్చినట్లుగా బట్టలు వేసుకుంటూ, ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ హాయిగా బతికేస్తున్నారు ప్రగతి. తన తీరు గురించి ఎవరైనా ఏమైనా ట్రోలింగ్ చేస్తే వెంటనే వాళ్ల అంతు చూసే వరకు వదిలిపెట్టరు.
వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రగతి రోజూ జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్, హెవీ ఎక్సర్‌సైజులు చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపి, రోడ్డుపై కుర్రాళ్లకు షాకిచ్చింది. అయితే ప్రగతిలో నటి మాత్రమే కాకుండా ఓ వెయిట్ లిఫ్టర్ కూడా ఉన్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. జిమ్‌లో భారీగా వెయిట్ లిఫ్టింగ్ చేయడమే కాదు.. బయట కూడా తను ఛాంపియన్ అని నిరూపించుకున్నారు ప్రగతి. పలు పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించింది. తాజాగా ప్రగతి సరికొత్త చరిత్ర సృష్టించింది.
3 మెడల్స్ సాధించిన ప్రగతి
కేరళలోని కోజీకోడ్‌లో జరిగిన మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో తన బృందంతో కలిసి పాల్గొన్నారు. ఈ పోటీలలో గోల్డ్ మెడల్‌తో పాటు మరో రెండు మెడల్స్‌ను ఆమె సంపాదించారు. స్క్వేట్ 115 కిలోలు, బెంజ్ ప్రెస్ 50 కిలోలు, డెడ్ లిఫ్ట్ 122.5 కిలోల పోటీలలో ప్రగతి పాల్గొని మూడు మెడల్స్ సాధించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రగతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. 48 ఏళ్ల వయసులోనూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదలతో సాగుతున్న ప్రగతిని నెటిజన్లు విష్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











