నటి ప్రగతి వర్కౌట్స్ మామూలుగా లేవుగా.. చూస్తే మతిపోవాల్సిందే!
టాలీవుడ్‌లో అమ్మగా, అత్తగా, అక్కగా అనేక పద్ధతి అయిన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించే ఆమె కేవలం నటనలోనే కాదు సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు వీడియోలు చేస్తోంది. ఆ తర్వాత అప్పుడప్పుడూ హాట్ వర్కౌట్స్ కూడా చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తూ చర్చనీయాంశంగా మారుతోంది.రచ్చ రేపింది. వివరాల్లోకి వెళితే

హీరోయిన్ గా
తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి ప్రగతి సుపరిచితం. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషిస్తూ ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 120కి పైగా సినిమాల్లో నటించింది. నిజానికి ఆమె ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టినా సినిమాల్లో హీరోయిన్ గా మారాలని చెన్నై వెళ్లారు.

హాట్ వర్కౌట్ వీడియో
మొదట హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగతి తనకు వర్కౌట్ కాదని భావించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రగతి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన రకరకాల వీడియోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు తన క్యూట్ అండ్ హాట్ డాన్స్ వీడియోలు పోస్ట్ చేసి కుర్రాళ్ళలో ఫాలోయింగ్ పెంచుకున్న ఆమె ఇప్పుడు తన హాట్ వర్కౌట్ వీడియో ఒకదానిని షేర్ చేసింది.

ఫిట్ నెస్ మీద సూపర్ ఫోకస్
ఇక సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపిస్తూ చీరకట్టులో కనిపించే ప్రగతి గత ఏడాది అయితే లాక్‌డౌన్ సమయంలో ఫిట్ నెస్ మీద సూపర్ ఫోకస్ పెట్టేసిందని చెప్పచ్చు. అందుకే ఎక్సర్సైజులు, జుంబా డాన్స్ వీడియోలు, మామూలు, డాన్స్ వీడియోలు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేటు వయసులో ఘాటు అందాలతో స్టెప్పులేస్తుండటంతో పాటు హాట్ వర్కౌట్స్ చేస్తూ ఉండడంతో ప్రగతికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

ట్రైనర్ తో కలిసి వర్కౌట్స్
అయితే, తాజాగా మరో వీడియోను ప్రగతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్చేశారు. ఈ వీడియోలో తన ట్రైనర్ తో కలిసి వర్కౌట్స్ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో ప్రగతి వైట్ టాప్ వేసుకుని, తెగ కష్టపడుతూ.. జిమ్ డ్రెస్‌లో అదరగొడుతోంది. ఇక ఈ వీడియో చూసిన అందరూ వావ్ ప్రగతి గారు మీరు సూపర్ అంటూ మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ ఏజ్‌లో కూడా
ఈ ఏజ్‌లో కూడా వయసు అయిపోయిందని కూర్చోకుండా వర్కౌట్స్ చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అలా ఆమె అభిమానులు అందరూ తమ అభిమాన నటిని మెచ్చుకుంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఆమెకు మరింత బూస్టప్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications











