నాకు టైమ్ వస్తుంది.. అప్పుడు చెబుతా.. నటి ప్రగతి వార్నింగ్

తల్లి, అక్క, వదిన, పెద్దమ్మ, అత్త వంటి పాత్రలతో ఒకప్పుడు తెలుగు తెరపై వెలుగొందారు నటి ప్రగతి. అందమైన తల్లిగా.. హీరోయిన్లను మించిన అందంతో చెలరేగిపోయారు. అయితే ఇప్పుడు అదంతా గతం. ఒకప్పటి హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా మారిపోవడంతో ప్రగతి, హేమ, సురేఖవాణి, సుధ వంటి వారికి అవకాశాలు తగ్గిపోయాయి. ఒకటి ఆరా సినిమాలు తప్పించి పెద్దగా వీరి హడావుడి కనిపించడం లేదు. ఆ దశలో నటి నుంచి అనూహ్యంగా పవర్‌ లిఫ్టర్‌గా మారి ఆశ్చర్యానికి గురిచేశారు నటి ప్రగతి.

కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలో పవర్ లిఫ్టర్‌గా తనకు ఏమాత్రం సంబంధం లేని రంగం వైపు ప్రగతి నిర్ణయం తీసుకోవడం ఒక సాహసమైతే.. 40+ వయసులో, అది కూడా మహిళ అయ్యుండి ఎంతో కష్టమైన ఈ రంగంలో అడుగుపెట్టారు. నిలదొక్కుకోవడమే కాదు.. భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో పతకాలు సాధిస్తూ దేశానికి సైతం గర్వకారణంగా నిలిచారు. సంకల్పం, పట్టుదల ఉంటే వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని ప్రగతి నిరూపించించారు.

Actress Pragathi Mahavadi s Powerful Reel on Dhurandhar Dialogue Goes Viral on Social Media

రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పలు పవర్‌ లిఫ్టింగ్ పోటీలలో పతకాలు సాధించిన ప్రగతి.. గతేడాది టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో నాలుగు పతకాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. దాంతో ప్రగతి పేరు, ఆమె సాధించిన విజయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. పవర్ లిఫ్టర్‌గా పలు టోర్నీలలో పాల్గొంటూనే తనకెంతో ఇష్టమైన నటనను కూడా కొనసాగిస్తున్నారు ప్రగతి. తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలలో నటిస్తున్నారు.

కొన్ని వందల సినిమాలలో తాను నటించినప్పటికీ.. గుర్తుండిపోయే క్యారెక్టర్, మనసుకు సంతృప్తినిచ్చే రోల్ తనకు దక్కలేదని ప్రగతి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఛాలెంజింగ్ రోల్స్ కోసం దర్శక నిర్మాతలు తనను ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదన్న బాధ వెంటాడేదని పలు ఇంటర్వ్యూలలో ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంలో ఏర్పడ్డ బాధతోనే పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లానని.. జిమ్‌లో పడ్డ కష్టం, సాధించిన విజయాలు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయని ప్రగతి తెలిపారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రగతి ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, వర్కవుట్స్‌కు సంబంధించిన వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 50 ప్లస్‌లో జిమ్‌లో వర్కవుట్స్ చేయడం చూసి కుర్రాళ్లు సైతం ఆశ్చర్యపోయేవారు. సోషల్ మీడియాలో పలు సినిమా పాటలు, సీన్స్‌కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటారు ప్రగతి. ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తోన్న ధురంధర్ సినిమాలోని డైలాగ్‌తో ఓ రీల్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ మూవీలోని కిస్మత్ కీ ఏక్ బోహోత్ ఖూబ్సూరత్ ఆదత్ హై... కీ వో వక్త్ ఆనే పర్ బదల్తీ హై (విధికి ఒక అందమైన అలవాటు ఉంది... సమయం వచ్చినప్పుడు అది మారిపోతుంది) అనే డైలాగ్ సినీ ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. తాజాగా ఈ డైలాగ్‌తో ప్రగతి పవర్‌ఫుల్ రీల్ చేసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దానికి ఆప్నా టైమ్ ఆయేగా (నాకు టైం వస్తుంది) అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: pragathi mahavadi Dhurandhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X