ఆ షూటింగ్‌లో అలాంటి అవమానం.. ఆ చేదు అనుభవాన్ని ఎలా మరిచిపోతా.. యాక్టర్ ప్రగతి

సినీ పరిశ్రమలో ప్రస్తుతం స్టార్స్‌గా, అగ్ర కథానాయికలుగా వెలుగొందుతున్న వారి జీవితం పూలపాన్పేం కాదు. ఎన్నో కష్టాలు, అవమానాలు, ఛీత్కారాలు దిగమింగి.. పస్తులుండి ఈ స్థాయికి చేరుకున్నవారే. కానీ ఆ కన్నీటిని మాత్రం ఎవ్వరూ మరచిపోరు, ఏదో ఒక సందర్భంలో గతం గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇందుకు ఎవరూ అతీతం కాదు. ఇండస్ట్రీకి వచ్చే కొత్తతరం వీటిని గుర్తు పెట్టుకుని మసలుకోవాలనేది వారి అభిమతం.

ఈ కోవలోకే వస్తారు ప్రగతి. ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన ఆమె తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్నారు. కేవలం 24 ఏళ్ల చిరుప్రాయంలోనే తల్లి క్యారెక్టర్ చేశారంటే ఆమె డేర్‌ను , వృత్తిపై ఉన్న గౌరవాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. తనతో సమానమైన వయసున్న హీరో హీరోయిన్లకు తల్లి రోల్ చేస్తున్నానని మొదట్లో ఎమోషనలైనా నెమ్మదిగా ఆ పాత్రలకు జీవం పోశారు. ముఖంపై చిరునవ్వు, నిండైన రూపంతో కనిపించే ప్రగతికి సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది.

Actress Pragathi recollects Her Bitter Experience In Her Life

40 ప్లస్‌లోనూ ప్రగతిది చెక్కు చెదరని అందం. వయసు పైబడుతున్నా ఫిట్‌నెస్ విషయంలో మాత్రం రాజీ పడేది లేదని ఆమె చెబుతుంటారు. గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్లు చేయడమే కాదు, టైట్ ఫిట్‌లు, స్లివ్‌లెస్ జాకెట్లు వేసుకుని కనిపిస్తుంటారు. ఈ విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా తగ్గేదే లేదంటూ ఎప్పటికప్పుడు వీడియోలను, ఫోటోలను అప్‌లోడ్ చేస్తుంటారు ప్రగతి. మొన్నామధ్య చీరలోనే జిమ్‌లో వ్యాయామాలు చేసి అందరికీ షాకిచ్చారు. ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని ప్రొఫెషనల్స్‌కే పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు.

ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే ప్రగతి చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు. అయితే భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులు ఇచ్చి కుమార్తెతో పాటు బయటకు వచ్చేశారు. హీరోయిన్‌గా బిజీగా ఉన్న దశలో పెళ్లి చేసుకోవాలని తన నిర్ణయం జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటని ప్రగతి అంటూ ఉంటారు. ఆ నిర్ణయం వల్ల తన జీవితం 10 , 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని.. కానీ తన కోపం, అమాయకత్వం, మూర్ఖత్వం వల్లే ఇలా జరిగిందని ప్రగతి ఎన్నోసార్లు చెప్పారు. కానీ తప్పు జరిగిందని గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పెట్టిన ఫోకస్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే పెట్టి ఉంటే తన లైఫ్ మరోలా ఉండేదని అంటూ ఉంటారు.

Actress Pragathi recollects Her Bitter Experience In Her Life

అయితే రెండో పెళ్లి గురించి , తన క్యారెక్టర్ గురించి మీడియాలో వచ్చే కథనాలకు అంతే ఘాటుగా బదులిస్తుంటారు ప్రగతి. ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా సరే కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్పెషాలిటి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి తన కెరీర్, పెళ్లి, విడాకులు, సినీ ప్రయాణంలో కష్టాలను పంచుకున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అవమానాన్ని జీవితంలో మరిచిపోలేనని చెప్పారు.

మధురైలో షూటింగ్ ఉండటంతో రూ.500 చేతిలో పెట్టుకుని అక్కడ దిగాను. ఆటో ఖర్చులు పోగా మరో రూ.400 మాత్రమే ఉన్నాయి. షూటింగ్ జరుగుతుంది.. రెండేళ్ల బాబుని పక్కనే ఉంచాను. ఓ అసిస్టెంట్‌ని పిలిచి బాబుకి తినడానికి ఏమైనా బిస్కెట్లు తీసుకురమ్మని చెప్పా. అతను మేనేజర్‌ను అడిగాడు, వచ్చాడు. సాయంత్రమైనా బిస్కెట్లు రాలేదు.. మరోసారి అడగమని ఆ అబ్బాయిని పంపాను. నాకు కొంచెం దగ్గరలోనే మేనేజర్ మాటలు వినిపిస్తున్నాయని ఇంట్లో తిండి లేదా మీకు పొద్దున్నుంచి బిస్కెట్ .. బిస్కెట్ అని విసిగిస్తున్నావ్ అని కోప్పడ్డాడు .

Actress Pragathi recollects Her Bitter Experience In Her Life

నేను తిరిగి అనలేని సిట్యూవేషన్.. ఆ సంఘటన తర్వాత నేను ఏదైనా తినాలన్నా నా డబ్బులతోనే తెప్పించుకుంటాను తప్పించి సెట్‌లో ఏదైనా అడగాలన్నా భయం. ఆ రోజున తన వద్ద ఉన్న డబ్బులోంచే అసిస్టెంట్‌కు కూడా జీతం ఇవ్వాలి. ఎక్స్‌ట్రాగా ఉంచుకున్న వందలోంచి బిస్కెట్లు, చిప్స్ అన్ని తెప్పించి బాబుకు పెట్టుకున్నానని ప్రగతి గుర్తుచేసుకున్నారు. ఇలాంటి అవమానాల నుంచి కసిగా బతకడం నేర్చుకుని.. ఇక్కడి దాకా వచ్చానని'' ఆమె తెలిపారు. ప్రస్తుతం ప్రగతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X