ఇండస్ట్రీలో నన్ను అలా తొక్కేశారు.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్
తల్లి, అక్కా, వదిన ఇతర సహాయ పాత్రలతో తెలుగునాట పాపులర్ అయ్యారు నటి ప్రగతి. హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. అనూహ్యాంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. అయినప్పటికీ తన ప్రతిభను నిరూపించుకుని వందలాది చిత్రాల్లో నటించారు ప్రగతి. అయితే గత కొన్నాళ్లుగా ప్రగతి సినిమాలకు దూరమై పవర్ లిఫ్టర్ అవతారం ఎత్తారు. పలు క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించారు శెభాష్ అనిపించుకున్నారు. 50 ఏళ్ల వయసులో మహిళ అయ్యుండి ఎంతో కష్టమైన ఈ పనిని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని ప్రగతి నిరూపిస్తున్నారు.
పవర్ లిఫ్టింగ్‌లో ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో పతకాలు సాధించిన ప్రగతి.. ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో నాలుగు పతకాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. దాంతో ప్రగతి పేరు చిత్ర సీమలో మారుమోగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రగతి తన తండ్రి మరణంతో కుటుంబ పోషణ నిమిత్తం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మోడలింగ్‌లోకి దిగిన ప్రగతి .. ఆ తర్వాత హీరోయిన్‌గా పలు తమిళ చిత్రాల్లో నటించారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. కానీ అనూహ్యంగా సినిమాలకు దూరమైన ప్రగతి పవర్ లిఫ్టర్ అవతారం ఎత్తి షాకిచ్చారు. దీని వెనుక ఏం జరిగింది? సినిమాలను ఎందుకు వదిలేశారు? అన్న దానిపై ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రగతి. ఈ వివరాల్లోకి వెళితే..

టర్కీలో పతకాలు గెలిచాక నా మైండ్ బ్లాంక్ అయ్యింది. డిస్ట్రిక్ట్, స్టేట్, ఇంటర్ స్టేట్, నేషనల్ గేమ్స్‌లో ఆడాక.. కాంపిటీషన్‌కు వెళ్లడం రావడం అలవాటు అయిపోయింది. ఏ స్టేజ్ మీదకి వెళ్లినా అంచనాలతో వెళ్లను. టర్కీలో విజయం సాధించం, పతకాలు సాధించడం అనేది తీసుకోవడం ఇంకా కలగానే ఉంది. క్రీడలకు ఎంత ఎఫర్ట్ పెడతానో, సినిమాకు కూడా నూటికి నూరు శాతం ఇచ్చాను. ఏ పనిచేసినా 100 పర్సెంట్ ఇస్తాను. సినిమాలలో ఎక్కడో నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ప్లాట్‌ఫాం నాకు దొరకలేదు. నా టాలెంట్ నేను చూపించడానికి అవకాశం రాలేదు. అలాంటి కొరత మనసులో ఎక్కడో ఒక చోట ఉంది. ఫలానా క్యారెక్టర్‌కు నన్నెందుకు పట్టించుకోలేదనే బాధ కూడా ఉంది. దానిని నెగిటివ్‌గా ఏం తీసుకోలేదు.. కానీ అది బెంగగానే అనిపించింది. అదెక్కడో మెల్లగా డిప్రెషన్‌లోకి మారుతుందోనని భయపడి ఇటు వైపు వచ్చాయి. అయితే ముందు నుంచి ఫిట్‌నెస్ పరంగా యాక్టీవ్. సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. వాళ్లు ఇచ్చేది నాకు నచ్చడం లేదు.. నేను అడిగింది వాళ్లు ఇవ్వడం లేదు. ఆ బాధలో దేవుడి దయ వల్ల నేను కరెక్ట్ ఛానెల్ ఎన్నుకున్నాను అని ప్రగతి తెలిపారు.
ప్రగతి అందం ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్‌లో పోయేదేం లేదు, ఉన్న అందం ఉంటది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తే లావు అయిపోతానేమో, అబ్బాయిలాగా కనిపిస్తానేమో అనుకోలేదు. వెయిట్ లిఫ్టింగ్ వల్ల గతంలో కంటే మానసికంగా స్ట్రాంగ్‌గా తయారయ్యాను. జిమ్ నుంచి వచ్చేటప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందో.. సినిమా సెట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. గతంలో బాధపడుతూ కూర్చొనే దానిని, ఇప్పుడు మొండిగా నాకు నచ్చింది, నేను మాత్రమే చేయగలను అని నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను చేస్తాను. తమిళంలో జయం రవి గారి సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాను. నన్ను ప్రేమించే స్నేహితులు, గుండెల్లో పెట్టుకుని చూసుకునే కూతురుంది అని ప్రగతి ఎమోషనల్ అయ్యారు.
నేను ముందు నుంచే తిండిపోతుని.. ఈ గేమ్‌కి బాగా తినడమే కావాలి. బాగా లావు అయిపోతానని భయపడినా విపరీతంగా కాలరీలు ఖర్చయ్యే ఈ ఆటలో బాగా తినడం నాకు ప్లస్‌గా మారింది. అయితే వర్కవుట్ చేయడానికి కొన్ని గంటల ముందు ఏం తినకూడదు. కడుపు నిండుగా ఉంటే వర్కవుట్ చేయలేను. సాయంత్రం 5 గంటలకు జిమ్‌కి వెళితే.. రాత్రి 8.30కి బయటకు వస్తాను. సినీ పరిశ్రమ కూడా నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. నటీనటులు, మా అసోసియేషన్ కూడా అభినందించింది. ఇండియాలో నా వయసులో స్పోర్ట్స్ ఈవెంట్‌కి వెళ్లినవాళ్లు ఎవరూ లేరు. నన్ను సన్మానించడానికి చాలామంది క్యూలో ఉన్నారు. నాకు నచ్చిన పాత్రలు రావడం లేదని బాధపడుతున్నాను కానీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఇస్తే ఏమైనా చేయగలను అని నిరూపించాను అని ప్రగతి చెప్పారు.


Click it and Unblock the Notifications











