వాన పాటలో ఆ హీరో నాతో అసభ్యంగా.. ఎలాంటి వార్నింగ్ ఇచ్చానంటే? సంచలన విషయాన్ని బయటపెట్టిన ప్రగతి

దక్షిణాది సినిమా పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందర్నీ ఆకట్టుకొంటున్న ప్రగతికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. విషయం ఏదైనా ముక్కు సూటిగా సుతిమెత్తగా మాట్లాడటంలో దిట్ట. తన ప్రవర్తన తీరు వల్లే ప్రతిభకు తగిన ఫలితాన్ని అందుకోలేకపోయానని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకొన్నారు. అయితే ఓ హీరో తనతో ప్రవర్తించిన తీరు గురించి మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించడం సంచలనం రేపింది. ఓ పాత ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ..

నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక సినిమాలో హీరోయిన్‌గా చేశాను. ఆ సినిమాకు హీరోనే నిర్మాత, దర్శకుడు. అయితే ఆయన పేరు చెప్పడం ప్రస్తుతం అప్రస్తుతం. ఆ సమయంలో మాపై ఓ వాన పాట షూట్ చేస్తున్నారు. అప్పుడు నాకు ఓ డ్రస్ ఇచ్చి వేసుకోమన్నారు. కానీ అసభ్యంగా ఉండటంతో ఆ దుస్తులు ధరించనని చెప్పాను. దాంతో అతడితో నాకు గొడవ జరిగింది అని ప్రగతి చెప్పారు.

Pragathi news

హీరోతో గొడవ చిన్నగా మొదలై.. పెద్దగా మారింది. ఆ హీరోయిన్ వేసుకోలేదా? ఈ హీరోయిన్ వేసుకోలేదా అని అంటే.. వారి మాదిరిగా నేను కాను. వాళ్ల మాదిరిగా నేను చేయలేను అని సూటిగా జవాబు చెప్పాను. నాతో అసభ్యంగా మాట్లాడాడు. దాంతో నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాను. ఆ గొడవ పెద్దగా కావడంతో షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయాను అని ప్రగతి తెలిపారు.

ఇక తాను మధ్యలోనే ఇంటికి రావడం చూసి మా అమ్మ కంగారు పడింది. అయితే గొడవ జరిగింది. మూవీ యూనిట్ వస్తారు. మీరు కామ్‌గా వినండి. నేను వారికి ఏం సమాధానం చెప్పాలో చెబుతాను అని అమ్మకు చెప్పాను. హీరో కమ్ నిర్మాత నాపై ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడంతో వాళ్లు నా ఇంటికి వచ్చారు. నీ వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. చాలా నష్టం జరిగింది అని నాతో చెప్పారు.

Pragathi interview

అయితే నాకు జరిగిన చేదు అనుభవాన్ని చెప్పాను. అతడి ప్రవర్తన బాగా లేదు. కాబట్టే నేను అలా ప్రవర్తించాను. అయితే అతడి ముందే.. వచ్చిన వారితో వాడితో నేను నటించను అని తెగేసి చెప్పారు. అయితే వారు నచ్చజెప్పడంతో చివరకు నేను రాజీ పడ్డాను. దాంతో ఆ సినిమా చేయడానికి ఒప్పకొన్నాను అని ప్రగతి ఆ విషయాలను వెల్లడించింది.

Pragathi reveals Hero Misbehavior

కానీ షూటింగ్‌కు వెళ్లాలంటే కొన్ని కండిషన్స్ పెట్టాను. నాకు చెల్లించిన మొత్తం రెమ్యునరేషన్ ఇస్తేనే నేను షూటింగ్‌కు వస్తానని చెప్పాను. ఈ గొడవను దృష్టిలో పెట్టుకొని నా పారితోషికం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి నాకు రావాల్సిన డబ్బులు ఇస్తే వచ్చి షూట్ చేస్తాను అని చెప్పాను. దాంతో నాకు మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చారు. ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేశాను. ఆ సంఘటన తర్వాత సినిమా పరిశ్రమను వదిలేద్దామని నిర్ణయం కూడా తీసుకొన్నాను అని ప్రగతి చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X