48 ఏళ్ల వయసులో ప్రగతి సాహసం.. కుర్రాళ్లు తలదించాల్సిందే!

కృషి, పట్టుదల, సాధించాలన్న తపన ఉంటే వయసు అనేది పెద్ద అడ్డంకి కాదని ఎందరో నిరూపించారు. 90 ఏళ్ల వయసులో డిగ్రీలు , పీహెచ్‌డీలు చేసినవారు, రన్నింగ్ రేసులు చేసిన వారు ఎందరో. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న వారికి ఇలాంటి వారు స్పూర్తిదాయకం. ప్రస్తుతం మగవారితో సమానంగా ఆడవాళ్లు అన్నిచోట్లా విజయకేతనం ఎగురవేస్తున్నారు. పురుషులకే సొంతమైన కొన్ని పనుల్లో మహిళలు ప్రవేశించి ఘన విజయాలు సాధిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఓ అరుదైన ఘనతు సొంతం చేసుకున్నారు.

తెలుగులో అమ్మ, అక్క, చెల్లి, వదిన పాత్రలకు గతంలో కొందరు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచేవారు. సుధ, హేమ సుధ, సురేఖవాణి తదితరులు ఈ కేటగిరీలో పాపులర్ అయ్యారు. కొందరు దర్శకులకైతే వీళ్లు ఆస్ధాన నటీమణుల కిందే లెక్క. అయితే సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేసరికి ఇలాంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్ట్‌లోకే వస్తారు ప్రగతి. హీరో హీరోయిన్ల తల్లిగా కొన్నేళ్ల పాటు ఈమె హవా నడిచింది. అందమైన హీరోలకు అంతే అందమైన , స్టైలీష్ తల్లిగా ప్రగతి హల్‌చల్ చేశారు.

actress pragathi won Gold medal in weightlifting championship at hyderabad

ఒకానొక దశలో అన్ని సినిమాల్లో సురేఖ ఉండాల్సిందే అన్నంతగా ఆమె ముద్ర వేశారు. అయితే ఇప్పుడు తన తగ్గడంతో ఒకటి అరా తప్పించి సినిమాలకు దూరమయ్యారు. కామెడీ అయినా, సెంటిమెంట్ అయినా అవలీలగా చేయగలదని నిరూపించుకున్నారు ప్రగతి. ముఖ్యంగా ఆమె కామెడీ, ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి వేసే పంచ్‌లకు మంచి గుర్తింపు దక్కింది. తొలుత హీరోయిన్‌గా వ్యహరించి ఆ తర్వాత అనూహ్య పరిస్ధితుల మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు ప్రగతి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ప్రగతి తొలుత మోడలింగ్ చేశారు. ప్రఖ్యాత మైసూర్ సిల్క్ ప్యాలెస్‌ సహా పలు టాప్ బ్రాండ్స్‌కు మోడల్‌గా వ్యవహరించారు. అనంతరం సినిమాలలో అడుగుపెట్టిన ప్రగతికి కోలీవుడ్ నటుడు భాగ్యరాజ్ అవకాశం కల్పించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వీట్ల విశేషాంగ సినిమాతో ప్రగతి అదృష్టం పరీక్షించుకున్నారు. హీరోయిన్‌గా బిజీ అయిన ఆమె తెలుగు, తమిళ, మలయాళ , కన్నడ చిత్రాల్లో నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి కావడంతో కొన్నాళ్లు నటనకు దూరమయ్యారు ప్రగతి. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రగతి సీరియల్స్‌ ద్వారా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత హీరో హీరోయిన్లకు తల్లిగా, వదినగా, అక్కగా నటిస్తూ వెనుదిరిగి చూసుకోలేదు.

ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి డైట్, వ్యాయామం విషయంలో పక్కాగా ఉంటారు. 50కి చేరువ అవుతున్నా టైట్ ఫిట్‌లు, స్లివ్‌లెస్ జాకెట్లు వేసుకుని కనిపిస్తుంటారు. ఈ విషయంలో ఎవరెన్ని అన్నా పట్టించుకోని ప్రగతి ఎప్పటికప్పుడు వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు . అంతేకాదు ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని ప్రొఫెషనల్స్‌కే పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు.

తాజాగా 48 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్నారు ప్రగతి. అంతేనా ఎందరికో పోటీ ఇచ్చి ఏకంగా గోల్డ్ మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మెడల్ బంగారు పతకంతో ప్రగతి పోస్ట్ చేసిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కుర్రాళ్లు, మగాళ్లు ప్రగతిని డెడికేషన్ చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: actress pragathi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X