Pratyusha Death Case: నటి ప్రత్యూష మరణం కేసు సంచలనం..సుప్రీం కోర్టు ఫైనల్ జడ్డిమెంట్
తెలుగు సినీ పరిశ్రమలో వర్ధమాన నటి ప్రత్యూష ఆకస్మిక మరణం సంచలనం రేపింది. 2002 ఫిబ్రవరి 22వ తేదీన ఆమె, తన బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ రెడ్డి ఇద్దరు విషం తీసుకొని అపస్మారక స్థితిలో హాస్పిటల్‌లో చేరారు. వారికి వైద్యులు చికిత్స జరుపుతుండగా ప్రత్యూష మరణించింది.. సిద్దార్థ్ రెడ్డి ప్రాణాపాయాన్ని తప్పించుకొని బతికాడు. అయితే తన కూతురిని కొందరు అత్యాచారం చేసి చంపేశారంటూ తల్లి సరోజిని దేవీ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురిది హత్యే.. ఆత్మహత్య కాదు అని మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నది. అయితే ఈ కేసులో నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి రెండేళ్లు శిక్ష తగ్గించడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తుది తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించనున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, వాదోపవాదనల విషయాల్లోకి వెళితే..
ప్రత్యూష కేసులో ఆత్మహత్యకు ప్రేరేపణ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి 2004 సంవత్సరంలో సెషన్స్ కోర్టు 5 ఏళ్ల శిక్షను విధించింది. 2011 సంవత్సరంలో హైకోర్టు 2 ఏళ్లకు తగ్గించింది. 2012 సంవత్సరంలో హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన అనంతరం 2025 సంవత్సరం నవంబర్ మాసంలో తీర్పును రిజర్వు చేసింది. దాదాపు 24 ఏళ్లుగా ఈ కేసులో సరోజిని న్యాయపోరాటం చేస్తున్నారు.

ప్రత్యూష కేసులో తమకు జరిగిన అన్యాయంపై సరోజిని దేవీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. నా కూతురిపై చాలా మంది అత్యాచారం చేసి చంపేశారు. ఒక అనుమానాస్పద మృతి కేసులో పరిగణనలోకి తీసుకోవాల్సిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రత్యూష తొడల మీద, కడుపు మీద ఒకరి కంటే ఎక్కువ మంది విస్రాలు ఉన్నాయి. మెడ, తొడలు, కడుపు గోళ్లతో రక్కిన మచ్చలు ఉన్నాయి. వాటిని సీబీఐ గానీ, పోలీసులు గానీ, సెషన్ కోర్టు గానీ, హై కోర్టు గానీ పరిగణనలోకి తీసుకోలేదు అని ప్రత్యూష తల్లి సరోజిని ఆరోపించారు.
ప్రత్యూష కేసులో సాక్ష్యాలను, ఆధారాలను మాయం చేశారు. సీబీఐ కూడా సరిగా దర్యాప్తు చేయలేదు. నా కూతురు ఒంటిపై ఉన్న గాయాలను అసలు పట్టించుకోలేదు. ఈ కేసులో నా కూతురుకు, నా పోరాటానికి న్యాయం జరుగలేదు. అందుకే నిందితుడికి శిక్ష తగ్గించడంపై తాను సవాల్ చేశాను అని సరోజిని అన్నారు.

24 క్రితం జరిగిన సినీ నటి ప్రత్యూష హత్య కేసులో నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి శిక్ష తక్కువగా విధించడాన్ని సవాల్ చేస్తూ.. ఆ శిక్షాకాలాన్ని పెంచాలంటూ తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును గత కొద్దికాలంగా విచారిస్తున్నది. ఈ కేసులో తుది తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించనున్న నేపథ్యంలో ఈ వార్త సంచలనంగా మారింది.
2002 సంవత్సరంలో ప్రత్యూష మరణం చోటు చేసుకొన్నది. హత్యా ఆరోపణలపై నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి 6 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను సెషన్స్ కోర్టు విధించింది. అయితే హైకోర్టు 2011 సంవత్సరంలో రెండు సంవత్సరాలు తగ్గిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే ఈ శిక్ష తగ్గింపున సవాల్ చేస్తూ సరోజిని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పును వెల్లడిస్తారనే విషయంపై ఉత్కంఠ మరోసారి నెలకొన్నది.


Click it and Unblock the Notifications











