ప్రత్యూష మరణం కేసులో నిందితుడికి ఎదురుదెబ్బ.. సుప్రీం సంచలన తీర్పు ఏమిటంటే?
సినీ నటి ప్రత్యూష మరణం కేసులో నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. గతంలో సెషన్ కోర్టు విధించిన 5 సంవత్సరాల శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నిందితుడికి ఊరట లభించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజిని దేవీ 2012 సంవత్సరంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే 24 ఏళ్ల తర్వాత ఈ కేసులో సుప్రీం కోర్టు ధర్యాసనం సంచలన తీర్పును వెల్లడించింది. ఈ కేసులో తుది తీర్పు వివరాల్లోకి వెళితే..
ప్రత్యూష మరణం కేసులో సిద్దార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను, 5 వేల రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్దార్థ్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించగా.. ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను 50 వేల రూపాయలకు పెంచుతూ 2011, డిసెంబర్ 28 తేదీన తీర్పు ఇచ్చారు. అయితే 2012 సంవత్సరంలో ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ 2012 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకొన్నది. నిందితుడు సిద్దార్థ్ రెడ్డిని నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గత 14 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరిగింది. చివరకు నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
24 క్రితం జరిగిన సినీ నటి ప్రత్యూష హత్య కేసులో నిందితుడు సిద్దార్థ్ రెడ్డికి శిక్ష తక్కువగా విధించడాన్ని సవాల్ చేస్తూ.. ఆ శిక్షాకాలాన్ని పెంచాలంటూ తల్లి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును గత కొద్దికాలంగా విచారించింది. ఈ కేసులో తుది తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించిన నేపథ్యంలో ఈ కేసు మరోసారి మీడియాలోను, సోషల్ మీడియాలోను చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











