ప్రత్యూష మరణం కేసులో ఇంకా అన్యాయమే.. కంటతడితో తల్లి సరోజిని రియాక్షన్ ఇదే!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రత్యూష మరణం కేసులో సిద్దార్థ్ రెడ్డికి సుప్రీం కోర్టు శిక్షను ఖరారు చేసింది. వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను, 5 వేల రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్దార్థ్ రెడ్డి హైకోర్టు ఆశ్రయించగా.. ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను 50 వేల రూపాయలకు పెంచుతూ 2011, డిసెంబర్ 28 తేదీన తీర్పు ఇచ్చారు. అయితే 2012 సంవత్సరంలో ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ 2012 సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 14 ఏళ్ల తర్వాత ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ శిక్షను అమలు చేయాలని సుప్రీ తీర్పు వెల్లడించింది.
సినీ నటి ప్రత్యూష మరణం కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె తల్లి సరోజిని దేవీ భావోద్వేగంతో స్పందించారు. టీవీ9 న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 24 ఏళ్ల పోరాటం, ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. కోర్టును తీర్పును గౌరవిస్తున్నాను. కానీ ఈ కేసులో నాకు న్యాయం జరుగలేదు. నా కూతురు ప్రాణం పోయింది. అత్యాచారానికి గురైంది. సుప్రీం తీర్పు తర్వాత కూడా నా వాదన అదే. హైకోర్టు తీర్పును సుప్రీం కన్ఫార్మ్ చేశారు. నాకు తెలిసి సిద్దార్థ్ రెడ్డి విదేశాల్లో ఉన్నాడు. వెంటనే సరెండర్ కావాలని తీర్పు వెల్లడించింది.

నా కూతురు జీవితం పోయింది. ఎంతో ఎత్తుకు ఎదుగాల్సిన నా కూతురు భవిష్యత్ నాశనమైంది. కాబట్టి నిందితుడికి జీవిత ఖైదు విధించాలి. నా కూతురు మరణించిన సమయంలోనే ఆధారాలు, సాక్ష్యాలను తారుమారు చేశారు. దాంతో ఉన్న సాక్ష్యాలతోనే న్యాయ పోరాటం చేస్తున్నాను. ఈ కేసులో అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవిత ఖైదు పడేది. ఈ కేసులో ఆశ్చర్యం ఏమిటంటే? పోస్ట్ మార్టమ్ చేసిన మునిస్వామి చేసిన రిపోర్టును పరిగణనలోకి తీసుకోలేదు అని సరోజని దేవీ అన్నారు.
ప్రత్యూష మరణించిన సమయంలో స్వయంగా పోస్ట్ మార్టమ్ చేసిన మునిస్వామి రిపోర్ట్‌ను పట్టించుకోలేదు. బాధితురాలిపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం జరిపారు అని చెప్పారు. అలాంటి రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా కేసును తప్పుదోవ పట్టించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా వారు.. ఈ కేసు ప్రత్యక్షంగా దర్యాప్తు చేయలేదు. సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ ఆ కమిటీ ఇచ్చిన సమాచారం మేరకే న్యాయస్థానంలో ప్రాసెస్ జరిగింది. మునిస్వామి రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు ఉన్నాయి అని సరోజిని దేవీ అన్నారు.
ప్రత్యూష మరణించిన సమయంలో ఆమే దేహంపై మెడ, గొంతు, ఛాతీ, కడుపుపై గాట్లు ఉన్నాయి. ఈ కేసు ఆరంభంలోనే మ్యాన్యుపులేట్ అయ్యాయి. ఈ కేసులో నాది అరణ్య రోదనే. కోర్టులో నేను చెప్పిన విషయాలను న్యాయస్థానాలు పట్టించుకోలేదు. సీడీఎఫ్‌డీ చెప్పిన వీడియో రికార్డును కోర్టుకు సమర్పించాం. కానీ న్యాయం జరుగలేదు. పాప చనిపోయిన తర్వాత చాలా బెదిరింపులు వచ్చాయి. మీ అమ్మాయి చనిపోయింది. నీకు ఉన్న ఒకే కొడుకు ఉన్నాడు. వాడు ఉంచుకోవాలనుకొంటున్నావా? లేదా? ఈ కేసు విషయంలో మీరు తగ్గకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. ప్రత్యూష కేసులో సాక్ష్యాలు తారుమారు అయిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు అని సరోజిని దేవీ చెప్పారు.
నాకు ఉన్న అవగాహన పరిధిలో నేను విచారించడమే కాకుండా ఎంక్వైరీ చేశాను. నా బిడ్డ బట్టలును కాల్చి వేయడం ద్వారా సాక్ష్యాలను తుడిచిపెట్టారు. ప్రతీ సాక్ష్యాన్ని తీసేశారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకొన్నదని చెప్పారు. దాంతో సీబీఐ కూడా ఏమీ చేయలేకపోయింది. దాంతో నేను ఒంటరిగానే న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తూనే ఉన్నాను అని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











