బ్లూ ఫిలింస్‌లో నటిస్తావా? వాళ్ల నుంచి భారీ ఆఫర్లు.. బయటపెట్టిన రమ్యశ్రీ

వాంప్ రోల్స్‌లో , బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన నటీమణుల్లో రమ్యశ్రీ ఒకరు. ఒకప్పుడు దక్షిణాదితో పాటు దాదాపు 9 భారతీయ భాషల్లో నటించిన ఈమె .. హీరోయిన్ మెటీరియల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మాతృభాష తెలుగులో కంటే కన్నడంలో హీరోయిన్‌గా రాణించి అక్కడి వారితో శెభాష్ అనిపించుకుంది. ఆమె సినిమాలను తగ్గించేదో లేక సినిమా వాళ్లు అప్రోచ్ కావడం లేదో కానీ ప్రస్తుతం రమ్యశ్రీ అంతగా కనిపించడం లేదు. ఇటీవల వరుస ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తున్నారామె.

విశాఖకు చెందిన ఈమె రాజకీయాల్లోనూ ఓ ట్రయల్ వేసి చూసింది. పొలిటికల్ టచ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో రాష్ట్ర, జాతీయ రాజకీయాలను రమ్యశ్రీ ఆసక్తిగా గమనించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ డెవలప్‌మెంట్ చూసి చంద్రబాబు నాయుడుని అభిమానించిన ఆమె.. తర్వాత సీఎంగా వచ్చిన వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా మారిపోయారు. ఆయన తీసుకొచ్చిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయెంబర్స్‌మెంట్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని రమ్యశ్రీ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

actress ramya sri made sensationl on her using uttarandhra slang here s the details

తాను షూటింగ్ స్పాట్‌లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు కుయ్ కుయ్ మంటూ అంబులెన్సుల సౌండ్ వినిపించేదని, అదేంటి అని అడిగితే 108 అని .. ప్రమాదం జరిగిన 5 నిమిషాల్లోనే స్పాట్‌కు వస్తుందని అసిస్టెంట్స్ చెప్పేవారని రమ్యశ్రీ వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ నిత్యం జనాల్లో ఉండటం చూసి వైసీపీ ఆమె వైసీపీ వైపు వెళ్లారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వయంగా ప్రచారం చేశారు కూడా. అయితే కారణాలు తెలియదు కానీ ఎందుకో రమ్యశ్రీ వైసీపీనీ వీడారు.

ప్రజంట్ ఖాళీగా ఉండటంతో పలు యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆమె.. తన కెరీర్, సినీరంగంలోని సమస్యల గురించి ఆసక్తికర సంగతులను పంచుకుంటున్నారు. తాజాగా ఓ ఛానెల్‌తో రమ్మశ్రీ మాట్లాడుతూ.. తను ఎదురైన చేదు అనుభవాన్ని గురించి తెలిపారు. దాదాపు 9 భాషలలో నటించినా శ్రీకాకుళం యాసలో మాట్లాడుతున్నానని చాలా మంది తనను అడిగారని రమ్యశ్రీ వెల్లడించారు. నన్ను చూస్తే హాలీవుడ్ ఫిగర్‌లా ఉన్నానని .. అసలు తెలుగొచ్చా అని కామెంట్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు.

actress ramya sri made sensationl on her using uttarandhra slang here s the details

అలాగే ఉత్తరాంధ్ర యాసను ఎందుకు వదిలిపెట్టవని తనతో వర్క్ చేసిన హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు అడిగారని.. నా భాష నాకు తల్లిలాంటిదని రమ్యశ్రీ చెప్పారు. అసలు నా భాష, యాసను ఎందుకు వదిలేయాలని ఆమె ప్రశ్నించారు. తనకు దాదాపు 80 దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారని.. తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఇష్టపడతారని ఆమె చెప్పారు. ఓ మల్లిలో తన నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారని.. ఎథిక్స్ ఉన్న వ్యక్తిగా తనను చూసేవారని రమ్యశ్రీ తెలిపారు.

సన్నీలియోన్‌తో తనను పోల్చి చూడొద్దని సోషల్ మీడియాలో వార్నింగ్‌లు కూడా ఇచ్చారని వెల్లడించారు. తనను పోర్న్ సినిమాల్లో యాక్ట్ చేయమని కొందరు ఒత్తిడి చేశారని.. దీంతో తాను లాయర్ ద్వారా న్యాయపోరాటం చేశానని రమ్యశ్రీ బయటపెట్టారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రమ్యశ్రీకి అలాంటి ఆఫర్లు ఇచ్చింది ఎవరనేది మాత్రం తెలియరాలేదు. బహుశా త్వరలోనే ఆమె బయటపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

More from Filmibeat

Read more about: ramya sri movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X