For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్‌పై రమ్యశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు.. నాది వైసీపీనే అంటూ శృంగారతార కామెంట్

  |

  సినీ నటి రమ్యశ్రీ అంటే దాదాపు తెలుగువారందరికీ సుపరిచితమే.. అనేక సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి ఏకంగా ఒక సినిమా కోసం టాప్ లెస్ గా కూడా నటించి సంచలనం రేపారు.. అంతే కాక ఆమె శృంగార తారగా కూడా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

  30 Weds 21 ఫేమ్ అనన్య గ్లామరస్ ఫోటోస్.. లేలేత అందాలతో..

  సంచలన వ్యాఖ్యలు

  సంచలన వ్యాఖ్యలు

  నటి రమ్య శ్రీ ఈ మధ్య కాలంలో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. అయితే గత 2019 ఎన్నికలకు ముందు ఆమె ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో చేరి ఆ పార్టీ కోసం ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు జగన్ గాలి వీయడంతో అప్పుడు దాదాపుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది నటీనటులు ఇతర టెక్నీషియన్స్ కూడా జగన్ కు బహిరంగంగా మద్దతు తెలిపారు.

  అలా తెలిపిన వారిలో రమ్యశ్రీ కూడా ఒక రోజు ఆమె జగన్ సమక్షంలో పార్టీలో కూడా చేరారు. 2019 ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫైట్ కూడా నడిచింది.. అదేమిటంటే రమ్య శ్రీ వైసీపీ తరుపున ప్రచారం చేయగా ఆమె ఇద్దరు సోదరులలో ఒకరు టీడీపీ తరఫున మరొకరు జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు.

  అయితే ఆమె ప్రచారం చేసిన వైసీపీ అభ్యర్థి మాత్రం గెలుపొందారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె అనేక చోట్ల ప్రచారం నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

  ఎథిక్స్ ఉండాలి

  ఎథిక్స్ ఉండాలి

  పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ నటి రమ్యశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పవన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. నటుడిగా పవన్ సంపూర్ణ వ్యక్తి అని ఆయన నటన అంటే తనకు కూడా చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారు.

  ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి ప్రజలు నటన విషయంలో ఆదరిస్తున్నారని ఆమె వెల్లడించారు. అయితే సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని పేర్కొన్న ఆమె జనసేన విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. జనసేన నుంచి తన పెద్ద తమ్ముడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టపోయారని ఆమె ఆరోపించారు. రాజకీయాలలో కొన్ని ఎథిక్స్ ఉండాలని ఆ ఎథిక్స్ తోనే ఫైట్ చేయాలని ఆమె పేర్కొన్నారు.

  సింగిల్ గా బరిలోకి

  సింగిల్ గా బరిలోకి

  అయితే ఆ ఎథిక్స్ ఉండబట్టే కదా ఇంకా ఫైట్ చేస్తున్నారు అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించగా ఆయన ఏమి ఫైట్ చేయడం లేదని ఆమె అన్నారు. ముందు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారని, అదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణంగా తాము ఓడిపోయామని అక్కడ కొన్ని ఓట్లు ఇక్కడ కొన్ని ఓట్లు చీల్చి తమ ఓటమికి పవన్ కళ్యాణ్ కారణమయ్యారని పార్టీ ఆరోపిస్తోంది అని ఆమె అన్నారు.

  అక్కడికి అది వదిలేసి తాను సొంతంగా యుద్ధం చేస్తానని ప్రకటించి సింగిల్ గా బరిలోకి దిగారని, అలా దిగితే ఏం జరిగిందో తాను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని ప్రజలందరికీ ఆ ఫలితాలను తెలుసని ఆమె అన్నారు.

  డ్రాప్ అవుతున్నారు

  డ్రాప్ అవుతున్నారు

  అయితే రాజకీయాల్లో ఉన్న పవన్ పనితీరు గురించి చెప్పమని ప్రశ్నించగా అసలు ఆయన ఏం పని చేశారు చెప్పడానికి అంటూ ఆమె ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ని ఉద్యమాల పేరుతో లేకపోతే ప్రశ్నించడం పేరుతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కరెక్టే కానీ మధ్య మధ్యలో ఆయన డ్రాప్ అవుతున్నారు అని ఆమె విమర్శించారు.

  పవన్ కి కంటిన్యుటీ ఉండదని ఆయన మూడ్ ని బట్టి మారిపోతాడు అని ఆమె విమర్శించారు. ఆయనకు నిలకడ లేదని ఇలా నిలకడ లేకుండా ఉద్యమాలు చేస్తుంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారా అని ఆమె ప్రశ్నించారు.

  Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
  జెండా ఎగురవేస్తారు

  జెండా ఎగురవేస్తారు

  ఇక తన అంచనా మేరకు వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదని ఆమె అన్నారు. ఇక తాను పక్కాగా వైసిపి మనిషిని పేర్కొన్న ఆమె వచ్చే ఎన్నికల్లో ఏమైనా అవకాశం ఉంటే వైసీపీ తరఫున పని చేస్తానని పార్టీ పోటీ చేయమన్నా పోటీ చేస్తానని అన్నారు. ఇక తనకు టూరిజం శాఖ మీద ఆసక్తి ఎక్కువ అని ఆ శాఖకు సంబంధించి ఎలాంటి చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి పదవి ఇచ్చినా ముందుండి నడిపిస్తా అని చెప్పుకొచ్చారు. వచ్చే సారి కూడా ఖచ్చితంగా జగన్ అక్కడ గెలిచి జెండా ఎగురవేస్తారు అని ఆమె కుండబద్దలు కొట్టారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Actress Ramya has alleged that pavan kalyan has no stability in politics. she made some comments on in a recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X