Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
రేఖ ఇంట్లో కరోనావైరస్.. బంగ్లాను సీజ్ చేసిన అధికారులు
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనావైరస్ వార్త బయటకు వచ్చిన కొద్ది సేపటికే సీనియర్ నటి రేఖ ఇంటిలో కరోనావైరస్ వార్త బయటపడింది. రేఖ కరోనావైరస్ బారిన పడకపోవడం ఊరట కలిగించే విషయం కాగా, ఆమె బాడీగార్డులకు కోవిడ్ పాజిటివ్ అని తేలినందున ఆమె బంగ్లాను ముంబై మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.

రేఖ బాడీగార్డులకు శుక్రవారమే కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో శనివారం అధికారులకు సమాచారం అందించారు. రేఖ అందించిన సమాచారం మేరకు ఆమె ఇంటిని సీజ్ చేసి స్వాధీన పర్చుకొన్నారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న బ్యాండ్‌స్టాండ్ ప్రాంతంలోని సీ స్ప్రింగ్స్ బంగ్లాను బీఎంసీ అధికారులు సీజ్ చేవారు. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. ఆమె బంగ్లా ముందు నోటీస్ అతికించారు. ఆ ప్రాంతాన్ని శనివారం శానిటైజ్ చేసి శుభ్రపరిచారు. అయితే రేఖ నుంచి గానీ, ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి గానీ ఎలాంటి అధికార ప్రకటన రాకపోవడం గమనార్హం.