ఆ పాపం చేసి వాళ్లు ఇక నరకానికే.. రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు
Renu desai: పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి, హీరోయిన్ రేణు దేశాయ్ తరచుగా వార్తలలో ఉంటునే ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ పలు సంచలన విషయాలను వెల్లడిస్తుంటారు. తనకు ద్రుష్టికి వచ్చిన సమస్యలను ఎలాంటి భయం లేకుండా నిలదీస్తోంది. తాజాగా ఓ విషయంపై తాజాగా సీరియస్ అయ్యింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సమస్య ఏంటో? ఆ రేణు దేశాయ్ కామెంట్స్ ఏంటో ఓ లూక్కేయండి.
హీరోయిన్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతిమణీ. కానీ..ఇప్పుడూ మాజీ భార్య. రేణూ దేశాయ్ జంతు ప్రేమికురాలు. జంతువుల కోసం ఆమె పడే తాపత్రయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నిత్యం పేదలు, జంతువుల రక్షణ, వైద్యం కోసం విరాళాలు అందిస్తూనే ఉంటుంది. అలాగే.. ఆమె పెద్ద ఎత్తున విరాళాలను కూడా సేకరిస్తుంటుంది. మూగ జీవుల సంరక్షణ కోసం పని చేసే స్వచ్చంద సంస్థలకు సాయం చేస్తుంటుంది. నోరులేని జీవాల పట్ల తన ప్రేమను చాటుకుంటు ఉంటారు.

ఈ క్రమంలోనే జంతు బలులకు వ్యతిరేకంగా పోరాడుతోంది రేణూ దేశాయ్. తాజాగా కొంత మంది వ్యక్తులు నోరులేని జీవాల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహారించిన పలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ జంతు బలులపై తీవ్రంగా మండి పడింది రేణూ దేశాయ్. ప్రస్తుత రేణుదేశాయ్ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..?
వైరల్ గా మారినా ఆ వీడియోలో 'ఒక యువకుడు కుక్కను నెలకేసి కొట్టిన వీడియోపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఇటీవల చాలా చోట్ల నోరులేనీ జీవాలను బలి ఇవ్వడంపై కూడా ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుక్కను కొట్టిన యువకుడి అడ్రస్ తనకు ఇవ్వాలని, అతని సంగతి చెప్పుతా అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే.. కుక్కను వేధించిన వ్యక్తి అరెస్ట్ అయ్యే వరకు రేణు దేశాయ్ వదిలిపెట్టలేదు.
తాజాగా ఆమె మరో వివాదంపై రియాక్ట్ అయ్యారు. రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కొంత మంది యువకులు అమ్మవారికి జంతు బలి చేస్తూ కనిపించారు. ఈ వీడియోపై రేణు దేశాయ్ స్పందిస్తూ.. ఏ దేవుడు దేవత కూడా జంతువులు బలి ఇస్తేనే సంతోషిస్తాడని చెప్పలేదని మండిపడ్డారు. చాలామంది దసరా నవరాత్రులలో మూఢనమ్మకాలతో జంతువులన బలిఇస్తుంటారనీ, ఏ దేవత అయినా..ఏ తల్లి అయినా.. రక్తం తీసుకుంటుందా.. మూఢ నమ్మకాల పేరిట జీవులను బలిస్తే ఆ తల్లి శాంతిస్తుంది? అని ఎక్కడ ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది రేణుదేశాయ్ . ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











