HanuMan షూటింగ్‌లో ప్రమాదం.. పారిపోయిన సూపర్ హీరో.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన జబర్దస్త్ బ్యూటీ!

తేజా సజ్జా హీరోగా వచ్చిన తాజా బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. సూపర్ హీరోగా తేజా సజ్జా అద్భుతంగా నటించగా... ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. అయితే తాజాగా హనుమాన్ సక్సెస్ మీటింగ్ లో పాల్గొన్న సెకండ్ హీరోయిన్.. షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి చెప్పింది. అలాగే సూపర్ హీరో భయపడుతూ పారిపోయిన విషయాన్ని కూడా వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అనగానే అంతా వరలక్ష్మీ శరత్ కుమార్ అని అనుకుంటారు. కానీ సెకండ్ హీరోయిన్ మాత్రం ఆమె కాదు. నటి రోహణియే సెకండ్ హీరోయిన్ అంట. కమెడియన్ గా కెరియర్ ప్రారంభించిన ఈమెనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సెకండ్ హీరోయిన్ అంటూ వ్యాఖ్యనించే వారట. ఆ విషయాన్ని నేరుగా రోహిణియే చెప్పింది. అలాగే సూపర్ హీరోగా కనిపించిన తేజా సజ్జా గురించి కూడా షాకింగ్ విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ ప్రమాదం జరిగిందని.. తొలిసారి అసలు విషయాన్ని వివరించింది.

Actress Rohini Reveal Small Accdent in HanuMan Shotting Check Details

ఎద్దుల బండి సీన్ జరుగుతున్నప్పుడు.. ఎద్దులు సహకరించిన ఓ వైపు బండి అంతా వంగిపోయిందని.. అయితే అప్పుడు ఓ వైపు లోయ, మరోవైపు గుంత ఉన్నాయని... ప్రమాదం జరిగిన వెంటనే సూపర్ హీరో తేజా సజ్జా కిందకు దిగి పారిపోయాడని గుర్తు చేసింది. బండిపై నాలాంటి అందమైన హీరోయిన్ ఉంటే కాపాడకుండా అలా వెళ్లిపోయావు ఏంటి తేజా అంటూ స్టేజీపై ఉండగానే అడిగేసింది. దానికి తేజా సిగ్గు పడి అలాంటివి అడగకు అంటూ సైగ చేయగా.. ఇలాంటివి చెబితే ఆయన రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్లిపోతారంటూ అంటూ మళ్లీ పంచ్ వేసింది.

ఇక ఆ తర్వాత ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు థాంక్స్ చెప్పింది. అంతేకాదండోయ్.. జై హనుమాన్ సినిమాలో తనకు క్యారెక్టర్ రోల్ లెంత్ పెంచాలని.. ఎక్కువ సేపు తాను తెరపై కనిపించేలా చేయాలని కూడా అడిగింది. అందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కచ్చితంగా అని చెప్పారు. ఆయన చెప్పిన విధానం చూస్తుంటే.. నటి రోహిణి పార్ట్ 2 అంటే జై హనుమాన్ సినిమాలో కూడా కచ్చితంగా కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది.

Actress Rohini Reveal Small Accdent in HanuMan Shotting Check Details

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబడుతూనే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఈ మూవీ సుమారుగా 300 కోట్ల వసూళ్లను 3వ వారం నమోదు చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X